Asianet News TeluguAsianet News Telugu

ద‌త్త‌త కోసం 3-4 ఏళ్లు ఎదురు చూడాల్సి వ‌స్తోంది.. ఈ ప్ర‌క్రియ‌ను సుల‌భ‌త‌రం చేయండి - కేంద్రంతో సుప్రీంకోర్టు

భారతదేశంలో అనాథ పిల్లల దత్తత ప్రక్రియ చాలా సంక్లిష్టంగా ఉందని, దీనిని మార్చాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన చేసింది. ఒక అనాథను దత్తత తీసుకోవాలంటే 3 నుంచి 4 సంవత్సరాల కాలం పడుతోందని తెలిపింది. ఓ సచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్ సందర్భంగా భారత అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. 

Waiting for 3-4 years for adoption.. Simplify this process - Supreme Court to Center
Author
First Published Aug 27, 2022, 4:11 PM IST

లక్షలాది మంది పిల్లలను దత్తత తీసుకునేందుకు ఎన్నో జంట‌లు ఎదురు చూస్తున్నాయ‌ని, అయితే ఈ ప్ర‌క్రియ‌కు మూడు నాలుగేళ్లు ప‌డుతోంద‌ని సుప్రీంకోర్టు ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. దీనిని మార్చాల్సి అస‌వ‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డింది. భార‌త‌దేశంలో పిల్లల దత్తత ప్రక్రియను క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఏర్ప‌డింద‌ని పేర్కొంది. 

సీబీఐ దాడులు.. బీజేపీ ప్రధాన కార్యాలయం ఎదుట ఆప్‌ నిరసనలు

న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, ఎఎస్ బోపన్న, జేబీ పార్దివాలాలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్య‌లు చేసింది. కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ కెఎమ్ నటరాజ్‌తో మాట్లాడుతూ.. ‘‘ చాలా మంది యువ జంటలు బిడ్డను దత్తత తీసుకోవడానికి వేచి ఉన్నారు, అయితే ఈ ప్రక్రియ చాలా దుర్భరమైనది, సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (CARA) ద్వారా ఒక బిడ్డను దత్తత తీసుకోవాలంటే  మూడు నాలుగేళ్లు పడుతోంది. ఈ వ్య‌వ‌ధిని మీరు ఊహించగలరా? దీన్ని మరింత సరళంగా చేయాలి ’’ అని అన్నారు. 

దేశంలో పిల్లల దత్తత ప్రక్రియను సులభతరం చేయాలని కోరుతూ ‘ది టెంపుల్ ఆఫ్ హీలింగ్’ ఏన్జీవో ఓ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. దీనిపై ఆరు వారాల్లోగా స‌మాధానం ఇవ్వాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. ఆ స్వచ్ఛంద సంస్థ సూచ‌న‌ల‌ను ప‌రిశీలించాల‌ని, దీనిపై నివేదికల‌ను దాఖ‌లు చేయ‌డానికి బాలల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన సీనియ‌ర్ అధికారిని ఒక‌రిని కేటాయించాల‌ని బెంచ్ నటరాజ్‌ను కోరింది.

అడిష‌న‌ల్ సొలిసిటర్ జనరల్ తో తన పిటిషన్‌ను పంచుకోవాలని, దత్తత ప్రక్రియను ఎలా సులభతరం చేయొచ్చ‌నే దానిపై మంత్రిత్వ శాఖలోని అధికారులకు సూచనలను అందించాలని ఈ విచార‌ణ సంద‌ర్భంగా వ్యక్తిగతంగా హాజరైన NGO కార్యదర్శి పీయూష్ సక్సేనాను కోర్టు కోరింది. తదుపరి విచారణను అక్టోబ‌ర్ కు బెంచ్ వాయిదా వేసింది.

Sonali Phogat: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులా మారాలని అనుకోవట్లేదు: సోనాలి ఫోగట్ కుటుంబం

ఈ విచార‌ణ సంద‌ర్భంగా బెంచ్ ప‌లు వ్యాఖ్య‌లు చేసింది. సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (CARA) ఏడాదికి 2,000 మంది పిల్ల‌ల‌ను ద‌త్త‌త ఇచ్చే సామ‌ర్థ్యం క‌లిగి ఉంద‌ని, అయితే అది ఇప్పుడు 4,000కి పెరిగింద‌ని పేర్కొంది. అయితే దేశంలో మూడు కోట్ల మంది అనాథ పిల్లలు ఉన్నార‌ని, అందుకే ఈ ప్ర‌క్రియ‌ను సుల‌భ‌త‌రం చేయాల్సి అవ‌స‌రం ఉంద‌ని వ్యాఖ్యానించింది. ఎన్జీవో ఉద్దేశంపై ఇంతకుముందు భయపడ్డామని, అయితే ఆ సంస్త తరపున హాజరవుతున్న పీయూష్ సక్సేనా గురించి తెలియగానే అది తొలిగిపోయింద‌ని పేర్కొంది. పెద్ద కార్పొరేట్ సంస్థలో ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఆయ‌న చేస్తున్న కృషిని అనుస‌రించే కేంద్రానికి నోటీసులు జారీ చేస్తున్నామని సుప్రీంకోర్టు పేర్కొంది.

గులాం నబీ ఆజాద్ జ‌మ్మూ కాశ్మీర్ సీఎం అవుతారు - కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అమీన్ భట్

ఏప్రిల్ 11వ తేదీన భారతదేశంలో పిల్లల దత్తత కోసం చట్టపరమైన ప్రక్రియను సులభతరం చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది, దేశంలో ఏటా 4,000 దత్తతలు మాత్రమే జరుగుతున్నాయని ఆ పిటిష‌న్ పేర్కొంది. ఎన్జీవో తరపున హాజరైన సక్సేనా.. పిల్లల దత్తత ప్రక్రియను సులభతరం చేయాలని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు అనేక ఫిర్యాదులు అందించాన‌ని, అయినా ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ఫ‌ల‌త‌మూ క‌నిపించ‌లేద‌ని పేర్కొన్నారు. ప‌బ్లిక్ డొమైన్ లో అందుబాటులో ఉన్న డేటా ప్ర‌కారం.. గ‌తేడాది వరకు దేశంలో మూడు కోట్ల మంది అనాథ పిల్లలు ఉన్నారని సక్సేనా పేర్కొన్నారు. చాలా మంది సంతానం లేని జంటలు బిడ్డను ద‌త్త‌త తీసుకోవ‌డానికి సిద్ధంగా ఉన్నాయ‌ని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios