ఈ రాశుల వారికి డేటింగ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు..
కొంతమంది డేటింగ్ కోసం సమయాన్ని అస్సలు వృథా చేయడానికి ఇష్టపడరు. అలాగే డేటింగ్ లో ఓపెన్ గా కూడా మాట్లాడరు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని రాశుల వారు వ్యక్తిగత కారణాల వల్ల డేటింగ్ ను అస్సలు ఇష్టపడరు.
డేటింగ్ చాలా మందికి ఉత్తేజాన్ని కలిగిస్తుంది. డేటింగ్ కొంతమందికి ఆహ్లాదకరంగా అనిపించినప్పటికీ.. వారితో ఉన్నవారికి కష్టంగా అనిపించొచ్చు. అవును జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని రాశుల వారు డేటింగ్ ను అస్సలు ఇష్టపడరు. ఇలాంటి వారితో డేటింగ్ కు వెళ్లిన వారికి చిరాకు తప్ప మరేమీ రాదు. అసలు ఏయే రాశుల వారికి డేటింగ్ అంటే ఇష్టముండదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
వృషభ రాశి
ఈ రాశికి చెందిన స్త్రీ పురుషులు శ్రమ, పట్టుదలతో తమ లక్ష్యాలను సాధించుకుంటారు. వీరికి సహనం ఎక్కువ. అలాగే వీరు కష్టల్లో ఉన్నవారికి ఎంతో సహాయపడతారు. ఈ రాశి స్త్రీ పురుషులు అన్ని విషయాల్లో మంచిగా ఉన్నప్పటికీ.. వీరికి డేటింగ్ అంటే అస్సలు ఇష్టముండదు.
Virgo daily horoscope
కన్యా రాశి
ఈ రాశి వారు ఆశావహులు. వీళ్లకు పట్టుదల ఎక్కువ. వీరికి ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువే. వీళ్లు తమ లక్ష్యాలను సాధించడానికి ఇతరుల సహాయం అస్సలు తీసుకోరు. ఈ రాశి వారు డేటింగ్ వల్ల సమయం వృధా అవుతుందని అనుకుంటారు. అందుకే డేటింగ్ పేరుతో వీళ్లు తమ సమయాన్ని వేస్ట్ చేసుకోరు. వీళ్లు కష్టపడి పనిచేస్తేనే బాగుపడతామని అనుకుంటారు. అందుకే ఈ రాశి వారు డేటింగ్ కు దూరంగా ఉంటారు.
Image: Pexels
వృశ్చిక రాశి
ఈ రాశివారు చాలా రహస్యంగా ఉంటారు. వీరి ఫీలింగ్స్ ను ఎవ్వరితోనూ చెప్పుకోరు. కానీ వీరికి అసూయ ఎక్కువగా ఉంటుంది. ఇది రిలేషన్ షిప్ కు అస్సలు మంచిది కాదు. ఫలితంగా వృశ్చిక రాశి వారికి డేటింగ్ కష్టంగా, అసౌకర్యంగా ఉంటుంది.
మకర రాశి
డేటింగ్ విషయానికొస్తే ఈ రాశి వారు వ్యాపారం గురించి ఎక్కువగా మాట్లాడతారు. ఈ రాశి వారితో డేటింగ్ చేయడం అంటే ఒక ఇంటర్వ్యూలా అనిపిస్తుంది. ప్రేమ విషయానికొస్తే వీరు వారి భావాల కంటే వారి మనస్సులను నమ్ముతారు.