Asianet News TeluguAsianet News Telugu

గులాం నబీ ఆజాద్ జ‌మ్మూ కాశ్మీర్ సీఎం అవుతారు - కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అమీన్ భట్

జమ్మూ కాశ్మీర్ తదుపరి సీఎంగా కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాదే ఉంటారని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అమీన్ భట్ ధీమ ా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆజాద్ తో శనివారం ఆయన భేటీ అయ్యారు. 

 

Ghulam Nabi Azad to become Jammu and Kashmir CM - Former Congress MLA Amin Bhatt
Author
First Published Aug 27, 2022, 3:01 PM IST

గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి దేశ రాజ‌కీయాల‌ను ఒక్క సారిగా షాకింగ్ కు గురి చేశాడు. కాంగ్రెస్ ప్రాథ‌మిక స‌భ్య‌త్వంతో పాటు అన్ని ప‌దవుల‌ను వ‌దులుకున్నారు. అయితే ఈ ప‌రిణామం జ‌రిగిన ఒక రోజు త‌రువాత జమ్మూ, కాశ్మీర్ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అమీన్ భట్ స్పందించారు.గులాం న‌బీ ఆజాద్ త్వ‌రలోనే జ‌మ్మూ కాశ్మీర్ సీఎం అవుతారని ఆయ‌న ఆయ‌న జ్యోస్యం చెప్పారు. 

మాజీ ఎమ్మెల్యే అమీన్ భట్ శనివారం ఆజాద్‌తో సమావేశమయ్యారు. ‘‘మేము ముందుకు వెళ్లే మార్గం గురించి చర్చిస్తాము, మేము భారతీయ జనతా పార్టీ (బీజేపీ) బీ టీమ్ కాదు’’ ఆజాద్ తో పాటు మరో ఏడుగురికి సంఘీభావంగా అమీన్ భట్ శుక్రవారం కూడా కాంగ్రెస్‌ను వీడారు.

ఎంతమందినైనా అరెస్టు చేయండి.. 2024లో కేజ్రీవాలే ప్రధాని: బీజేపీపై ఢిల్లీ మంత్రి విమర్శలు

కాగా.. శుక్రవారం కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆజాద్ తన భవిష్యత్ కార్యాచరణను నిన్ననే స్పష్టం చేశారు. తాను బీజేపీలో చేరేది లేదని.. జమ్మూకాశ్మీర్‌లో కొత్త పార్టీ పెడతానని ఆజాద్ స్పష్టం చేశారు. కాశ్మీర్‌లో ఇతర పార్టీలతో కలిసి అధికారం పంచుకునే ఆలోచనలో ఆయ‌న ఉన్నారు. అయితే ఆజాద్ నిర్ణయం పరోక్షంగా బీజేపీకి మేలు చేస్తుందనే అంచనాలు వ‌స్తన్నాయి. రానున్న జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు ఆయన సిద్ధం అవుతున్నారు.

ఆజాద్ తన రాజీనామా లేఖలో రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీలో మారిన పరిస్థితులే తన రాజీనామాకు కారణమని దాదాపు చెప్పారు. ఐదు పేజీల లేఖలో పార్టీతో తన జీవిత ప్రయాణం, పార్టీ సాధించిన విజయాలు, అపజయాలను ప్రస్తావించారు. యూపీఏ 1, యూపీఏ 2 హయాంలో సోనియా గాంధీ తీరును మెచ్చుకుంటూనే ప్రస్తుత పరిణామాలపై విమర్శలు చేశారు. కొన్ని సూచనలూ చేశారు. కాగా, రాహుల్ గాంధీపై మాత్రం విరుచుకుపడ్డారు. ఆయన తన రాజీనామా లేఖలో పార్టీలో ప్రతికూల పరిస్థితులు, తప్పుడు పద్ధతులను ఎత్తి చూపారు. తన రాజీనామాకు పార్టీలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులనే కారణంగా చూపించారు. కాంగ్రెస్ పై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

స్టాండప్ కమేడియన్ మునావర్ ఫరూఖీ ఢిల్లీ షో రద్దు.. మత సామసర్యం దెబ్బతింటుందని అనుమతి నిరాకరణ

రాహుల్ గాంధీ తీసుకున్న చ‌ర్య‌ల  కారణంగా 2014లో కాంగ్రెస్ ఓడిపోయిందని ఆజాద్ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. అలాగే ఆయన (రాహుల్ గాంధీ) రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పార్టీలో ఉండే సంప్రదింపుల వ్యవస్థను సర్వం నాశనం చేశారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ చుట్టూ కొత్తగా సైకోల కోటరీ ఒకటి ఏర్పడిందని, ఇప్పుడు వారే పార్టీ వ్యవహారాలను నడుపుతున్నారని ఆరోపించారు. ఆయన గార్డులు, పర్సనల్ అసిస్టెంట్లు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని తీవ్రంగా దుయ్య‌బ‌ట్టారు.

టెకీలకు సైకిల్ దొంగ బురిడీ, 100 బైస్కిళ్ల చోరీ.. లబోదిబో మంటున్న ఉద్యోగులు..

గ‌తంలో కాంగ్రెస్ అంటే జాతీయ ఉద్యమం.. దేశ స్వాంతంత్య్రం కోసం పోరాడిన పార్టీ అని గుర్తు చేస్తూ.. ఇప్పుడు కొందరు ఆ పార్టీని శాశ్వతంగా తమ గుప్పిట్లో ఉంచుకోవాలని పరితపిస్తున్నారని గులాం న‌బీ ఆజాద్ ఆరోపణలు గుప్పించారు. వ్యవస్థాగత ఎన్నికలు కేవలం మాట‌లే అని చెప్పారు. ఒక వేళ గాంధీయేతరులను అధ్యక్షులుగా ఎన్నుకున్నా వారు కీలు బొమ్మలానే ఉంటార‌ని, వారి నిర్ణ‌యాలు చెల్ల‌వ‌ని విమ‌ర్శించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios