'అగ్రవర్ణాల వారు పరీక్షపేపర్లు సెట్ చేస్తే.. దళితులు ఫెయిల్' : రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు
Rahul Gandhi: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇది మేఘ్ అప్‌డేట్స్ అనే ట్వీట్ హ్యాండిల్‌లో షేర్ చేయబడింది. ఇంతకీ ఏమన్నారు?
Rahul Gandhi: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 150 సీట్లు కూడా రావని, రాజ్యాంగాన్ని మార్చడం బీజేపీ, ఆరెస్సెస్‌లు లక్ష్యమని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సోమవారం అన్నారు.మధ్యప్రదేశ్‌లోని రత్లాం-ఝబువా లోక్‌సభ స్థానం పరిధిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. పోటీ పరీక్షలలో అణగారిన తరగతులు, షెడ్యూల్డ్ తరగతులు ,వెనుకబడిన తరగతుల వారి మధ్య వివక్ష చూపుతున్నారని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ వీడియోలో రాహుల్ గాంధీ కొంతమందితో మాట్లాడుతూ.. అగ్రవర్ణాల వారు పరీక్షలో పేపర్లు సెట్ చేసారని, అందుకే దళిత కులాలకు చెందిన వారు ఫెయిల్ అవుతున్నారని ఆరోపించారు. అమెరికాలో నల్లజాతీయులు, శ్వేతజాతీయుల మధ్య చాలా కాలంగా వివక్ష ఉందని చూపుతూ రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారుతుంది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సమాజంలో విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఓ వినియోగదారుడు ఆరోపించారు. రాహుల్ గాంధీ సామాజిక వర్గాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని అన్నారు.
ఇంతకీ రాహుల్ గాంధీ ఏమన్నారు?
ప్రస్తుతం రాహుల్ గాంధీకి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇది మేఘ్ అప్‌డేట్స్ అనే ట్వీట్ హ్యాండిల్‌లో షేర్ చేయబడింది. ఈ యూజర్ ఐడీలో షేర్ చేసిన వీడియోలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఏది ఎక్కువ యోగ్యమైనదిగా చెప్పబడుతుందో ఎవరు నిర్ణయిస్తారు? అమెరికాలో ఇప్పటికీ ఓ వివక్ష కొనసాగుతోంది. మనకు ఇక్కడ ఐఐటీ ఉన్నట్లే అమెరికాలో టాప్ ఎగ్జామ్స్‌ని SAT అంటారు. SATని మొదటిసారిగా అమలు చేసినప్పుడు, ఒక విచిత్రం జరిగింది. అమెరికాలో తెల్లవారిని ఉన్నత వర్గాల వారిగా.. నల్లగా ఉన్న వారిని అధమ వర్గాలుగా వివక్ష చూపుతారని అన్నారు. ఈ విషయంపై ప్రముఖ విద్యావేత్తలు నల్లజాతీయులు, స్పానిష్ మాట్లాడే లాటిన్ అమెరికన్లు యోగ్యత లేనివారని అన్నారు. వారు విషయాన్ని అర్థం చేసుకోలేరనీ, సామర్థ్యం లేని వారిగా భావిస్తారని రాహుల్ గాంధీ అనడం చూడవచ్చు.
సోషల్ మీడియాలో అభ్యంతరాలు
రాహుల్ గాంధీ ప్రకటనపై సోషల్ మీడియాలో అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. ఇది సమాజాన్ని విభజించే ప్రకటన అని కొందరు, సమాజానికి ముప్పు అని కొందరు అంటున్నారు. రాహుల్ గాంధీ ప్రకటన హిందువులను విభజించే ప్రకటనగా ఒక వినియోగదారు అభివర్ణిస్తున్నారు. కాబట్టి దీనిని బ్రిటిష్ పాలసీ అని ఒకరు పేర్కొన్నారు.