MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • శంకర్‌ నిర్ణయం ప్రభాస్‌కి దెబ్బగా మారుతుందా?.. `భారతీయుడు 2` వాయిదా `కల్కి2898ఏడీ`కి ప్లస్సా మైనస్సా?

శంకర్‌ నిర్ణయం ప్రభాస్‌కి దెబ్బగా మారుతుందా?.. `భారతీయుడు 2` వాయిదా `కల్కి2898ఏడీ`కి ప్లస్సా మైనస్సా?

కమల్‌ హాసన్‌ నటించిన `భారతీయుడు 2` వాయిదా పడుతుందనే వార్తలు వస్తున్నాయి. మరి నిజంగానే పోస్ట్ పోన్‌ అయితే అది ప్రభాస్‌ `కల్కి2898ఏడీ`ని దెబ్బకొట్టే అవకాశం ఉందంటున్నారు.  

2 Min read
Author : Aithagoni Raju
Published : May 07 2024, 04:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రాల్లో `భారతీయుడు 2` ఒకటి. లోకనాయకుడు కమల్‌ హాసన్‌ హీరోగా నటిస్తున్న చిత్రమిది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత `భారతీయుడు`కి సీక్వెల్‌ వస్తుంది. గత నాలుగేళ్లుగా ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఎట్టకేలకు దీన్ని థియేటర్లోకి తీసుకురాబోతున్నారు. ఈ మూవీ షూటింగ్‌ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతుంది. అయితే సినిమాని వచ్చే నెలలో విడుదల చేయబోతున్నట్టు టీమ్‌ ప్రకటించింది. జూన్‌ రెండో వారంలో విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కానీ తాజాగా ఈ మూవీ వాయిదా పడుతుందనే వార్తలు వస్తున్నాయి. సినిమాని చాలా రోజులు వెనక్కి వెళ్తుందని అంటున్నారు. పోస్ట్ ప్రొడక్షన్‌ పరంగా డిలే అవుతున్న నేపథ్యంలో సినిమాని వాయిదా వేసినట్టు తెలుస్తుంది. కానీ సినిమా నెల రోజుల గ్యాప్‌లో రాబోతుందట. జూన్‌ రెండో వారంలో అనుకున్న ఈ సినిమాని జులై రెండో వారంలోగానీ, మూడో వారంలోగానీ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎక్కువగా జులై 11న రిలీజ్‌ డేట్‌ పర్ఫెక్ట్ అని భావిస్తున్నారు. శంకర్‌తోపాటు లైకా మూవీస్‌ కూడా ఇదే భావిస్తుందని తెలుస్తుంది. 

36

ఇదిలా ఉంటే ఈ నిర్ణయం ఇప్పుడు ప్రభాస్‌కి ఇబ్బందిగా మారుతుంది. `కల్కి2898ఏడీ` సినిమాపై ఆ ప్రభావం పడుతుందని అంటున్నారు. ఎందుకంటే ప్రభాస్‌ మూవీ జూన్‌ 27న రాబోతుంది. ఇది భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన మూవీ. భారీగా బిజినెస్‌ అయ్యింది. సుమరు ఆరు వందల కోట్ల వ్యాపారం జరిగిందని సమాచారం. అంటే 1200కోట్లు థియేట్రికల్‌గా రావాలి. ఇంతటి మొత్తం రావాలంటే లాంగ్‌ గ్యాప్‌ కావాలి. టికెట్‌ రేట్లు పెంచాలి. అప్పుడే సాధ్యమవుతుంది. లేదంటే చాలా కష్టం. పైగా సినిమా బాగుంటేనే అది సాధ్యమవుతుంది. ఏమాత్రం తేడా వచ్చినా భారీగా నష్టపోక తప్పదు. 

46

టాక్‌ ఎలా ఉన్నా, మూడు నాలుగు వారాలు పెద్ద సినిమాలు లేకపోతే అంతో ఇంతో రాబట్టుకోవచ్చు. కానీ ఏదైనా పెద్ద సినిమా వచ్చిందంటే ఆ ప్రభావం గట్టిగా పడుతుంది. అయితే `కల్కి2898ఏడీ` విడుదలైన రెండు వారాల్లోనే `భారతీయుడు2` రాబోతుంది. ఇది కూడా భారీ స్కేల్‌లో రిలీజ్‌ అవుతుంది. `విక్రమ్‌` తర్వాత కమల్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. పైగా సంచలనాలు సృష్టించిన `భారతీయుడు`కి సీక్వెల్‌ మూవీ, దీనికితోడు శంకర్‌ చిత్రం. దీంతో భారీ అంచనాలున్నాయి. రిలీజ్‌ రేంజ్‌ కూడా అలానే ఉంటుంది. 
 

56

కమల్‌కి తెలుగులోనూ మంచి మార్కెట్‌ ఉంది. నార్త్ లోనూ ఆయనకు మార్కెట్‌ ఉంది. సినిమా బాగుంటే కచ్చితంగా ఇది `కల్కి2898ఏడీ` కలెక్షన్లని గండి కొడుతుందని చెప్పొచ్చు. కమల్‌ సినిమా బాగుంటే అది కచ్చితంగా ప్రభాస్‌ సినిమాపై ప్రభావం చూపుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి శంకర్‌ ప్లాన్‌ ఎలాఉంటుంది, అదే డేట్‌కి వస్తారా? ఇంకా బ్యాక్‌ వెళ్తారా అనేది చూడాలి. ఇక శంకర్‌ రూపొందిస్తున్న `ఇండియన్‌ 2`లో కమల్‌తోపాటు సిద్ధార్థ్‌, కాజల్‌, రకుల్‌ నటిస్తున్నారు.

66

మరోవైపు ప్రభాస్‌ నటిస్తున్న `కల్కి`కి నాగ్‌ అశ్విన్‌ దర్శకుడు. ఇందులోనూ కమల్‌ గెస్ట్ రోల్‌ చేస్తుండగా, అమితాబ్ బచ్చన్‌, దీపికా, దిశా పటానీ నటిస్తున్నారు. యంగ్‌ హీరోలు నాని, విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌, రానా వంటి వారు గెస్ట్ లుగా మెరుస్తారని సమాచారం. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Pokiri Lift Scene: పోకిరిలో ఇలియానాతో లిఫ్ట్ సీన్, మహేష్ బాబు బాగా ఎంజాయ్ చేశాడట.. కారణం ఇదే
Recommended image2
Rishab Shetty: పాన్ ఇండియా స్టార్ రిషబ్ శెట్టి బర్త్ డే సెలెబ్రేషన్స్.. భార్య పిల్లలతో ఇలా, వైరల్ పోటోస్
Recommended image3
Akhil Akkineni: అఖిల్ ని ఆయన భార్య జైనబ్ ఏమని పిలుస్తుందో తెలుసా ? భలే విచిత్రంగా ఉందే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved