Asianet News TeluguAsianet News Telugu

సీబీఐ దాడులు.. బీజేపీ ప్రధాన కార్యాలయం ఎదుట ఆప్‌ నిరసనలు

ఢిల్లీ: సీబీఐ దాడులకు వ్యతిరేకంగా బీజేపీ ప్రధాన కార్యాలయం ఎదుట ఆప్‌ నిరసనలు చేపట్టింది. నిరసన విజువల్స్‌లో ఆప్ పార్టీ సభ్యులు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, దాడుల త‌ర్వాత  సీబీఐ కనుగొన్న విషయాలపై పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేయ‌డం క‌నిపించింది.
 

AAP protests in front of BJP headquarters against CBI raids
Author
Hyderabad, First Published Aug 27, 2022, 3:42 PM IST

ఆమ్ ఆద్మీ పార్టీ:  ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం ఎదుట ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) సభ్యులు నిరసనకు దిగారు. ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై సీబీఐ దాడులు చేయడంపై ఆ బీజేపీకి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నిరసన విజువల్స్‌లో ఆప్ పార్టీ సభ్యులు బీజేపీకి  వ్యతిరేకంగా నినాదాలు చేయడం క‌నిపించింది. దాడుల నుండి సీబీఐ కనుగొన్న విషయాలపై పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే, కేంద్ర ప్ర‌భుత్వం, బీజేపీకి వ్య‌తిరేకంగా ప్లకార్డులను ప్ర‌ద‌ర్శించారు. 

కాగా, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించి దాదాపు వారం రోజుల క్రితం సిసోడియా నివాసం, ఉపముఖ్యమంత్రి కార్యాలయంపై సీబీఐ దాడులు చేసినప్పటి నుండి ఆప్-బీజేపీల మధ్య వాగ్వివాదం తారాస్థాయికి చేరుకుంది.  ఎక్సైజ్ పాలసీ అమలులో అక్రమాలకు సంబంధించి సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న 15 మంది వ్యక్తులు, సంస్థల జాబితాలో ఆప్ నాయ‌కుడు మ‌నీష్ సిసోడియా కూడా ఉన్నారు.  గత ఏడాది నవంబరు 17న అమల్లోకి వచ్చిన పాలసీ అమలులో నిబంధనల ఉల్లంఘనలు, విధానపరమైన లోపాలపై ఆరోపించిన ఏజెన్సీ దర్యాప్తునకు లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా గత నెలలో సిఫారసు చేసిన తర్వాత శుక్రవారం ఆగస్టు 19న సీబీఐ దాడులు జరిగాయి.  విచారణకు సక్సేనా సిఫారసు చేయడంతో ఢిల్లీ ప్రభుత్వం జూలైలో ఈ విధానాన్ని ఉపసంహరించుకుంది.

ఆప్ నాయకుడు దుర్గేష్ పాఠక్ ఇతర పార్టీ సభ్యులతో పాటు, వంద‌ల మంది కార్య‌క‌ర్త‌లు దేశ రాజధానిలోని బీజేపీ కార్యాలయం వద్ద గుమిగూడి, కాషాయ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. “మనీష్ సిసోడియా జీ పూర్వీకుల గ్రామంపై కూడా సీబీఐ దాడులు చేసింది. సీబీఐ సోదాల్లో ఏం దొరికిందని దేశం వారం రోజులుగా అడుగుతోంది. ఇంతకు ముందు ఇతరులపై దాడి జరిగినప్పుడు వారిని కాపాడమని అడిగేవారు. దేశంలోనే తొలిసారిగా ఓ నిజాయితీ గల పార్టీ వచ్చిందని, ఈ దాడిలో ఏం దొరికిందని సీబీఐని అడిగే అవకాశం ఉందని పాఠక్ అన్నారు.  ఎక్సైజ్ పాలసీ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఆగస్టు 19న ఢిల్లీ డిప్యూటీ చీఫ్ మనీష్ సిసోడియా నివాసంలో 14 గంటల పాటు సోదాలు నిర్వహించింది. అప్పటి నుండి, ఈ అంశంపై ఆప్ని.. బీజేపీని, ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. ఈ దాడిలో ఏజెన్సీకి ఏమీ దొరకలేదని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్ర‌య‌త్నాలు చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేల‌కు కోట్ల రూపాయ‌ల‌ను ఆఫ‌ర్ ను కూడా ఇదే కోవ‌కు చెందిన‌ద‌ని పేర్కొంటున‌నారు. 

 

శుక్రవారం ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో సిసోడియా మాట్లాడుతూ.. ఢిల్లీ ప్రభుత్వ మంచి పనికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నందునే తన నివాసంపై సీబీఐ దాడులు నిర్వహించిందని అన్నారు.  అతని ఇంట్లో 14 గంటల పాటు జరిగిన దాడిలో సీబీఐ అధికారులు అతని బట్టలు, అతని పిల్లల దుస్తులను కూడా శోధించారు, కానీ ఏమీ కనుగొనబడలేదు.. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 అమలులో అవకతవకలు జరిగాయని ఆరోపించిన సీబీఐ కేసులో నిందితుడిగా ఉన్న సిసోడియా పేర్కొన్నారు.  తనపై సిబిఐ ఎఫ్‌ఐఆర్‌ను పూర్తిగా నకిలీ అని పేర్కొన్నారు. “నాపై ఎఫ్‌ఐఆర్ పూర్తిగా నకిలీది. నేను ఎలాంటి అవినీతికి పాల్పడలేదు.. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలను తొలగించేందుకు వాళ్లు (బీజేపీ) సీరియల్ కిల్లర్‌లా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను హతమార్చేందుకు వారు చేస్తున్న కృషిని పాఠశాలలు, ఆసుపత్రులను నిర్మించేందుకు వారు ఎంతగానో కృషి చేసి ఉండాలి' అని సిసోడియా విమ‌ర్శ‌లు గుప్పించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios