Asianet News TeluguAsianet News Telugu

నేటి ముఖ్య వార్తలు సంక్షిప్తంగా...


నేటి ముఖ్య వార్తలను మీరు మిస్సయ్యారా, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో సంఘటనలు, పరిణామాలు చోటు చేసుకున్నాయి. వాటిని ఇక్కడ మీ కోసం పొందు పరుస్తున్నాం.
 

Top stories of the day
Author
Hyderabad, First Published Jun 10, 2019, 6:45 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

తిరుమల పర్యటన: జగన్ తో మోడీ రహస్య చర్చలు

ప్రధాని మోడీ వైఎస్ జగన్ తో చర్చలు జరుపుతున్నప్పుడు మూడో వ్యక్తి లేడని సమాచారం. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణల సారాంశం ఏమిటనేది తెలిసే అవకాశం కూడా లేదు. మోడీ ఆదివారం సాయంత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విషయం తెలిసిందే. 

సిఎం జగన్ భద్రతలో లోపాలు: టీడీపి నేత రాకపై అనుమానాలు

టీడీపీ లీగల్ సెల్ సభ్యుడు వేదపండితుడిగా సచివాలయంలో అడుగుపెడితే సీఎం సెక్యూరిటీ ఏం చేస్తోందని వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. టీడీపీ లీగల్ సెల్ సభ్యుడు ముఖ్యమంత్రి చాంబర్ కుఎందుకు రావాల్సి వచ్చింది, అందులోనూ వేదపండితుడిగా ఎందుకు రావాల్సి వచ్చిందో ఇప్పటికైనా సీఎం సెక్యూరిటీ సిబ్బంది విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. 

‘అప్పుడు కోతలు కోశారు... ఇప్పుడు నోరు రావడం లేదే..?’


వైసీపీ నేత విజయసాయి రెడ్డి మరోసారి... ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత  చంద్రబాబు నాయుడుపై విమర్శల వర్షం కురిపించారు. 

 

చంద్రబాబు సెక్యూరిటీ కవర్ ను తగ్గించిన జగన్ సర్కార్

చంద్రబాబుకు ఉన్న జడ్ ప్లస్ కెటగిరీ భద్రత, బ్లాక్ క్యాట్ కమెండోల భద్రత కొనసాగుతుంది. చంద్రబాబు ఇక ఏ మాత్రం ముఖ్యమంత్రి కాకపోవడంతో ఆయన కాన్వాయ్ ముందుకు కదిలినప్పుడు పనిచేసే అడ్వాన్స్ పైలట్లను ఉపసంహరించినట్లు తెలుస్తోంది. 
 

రాకేష్‌రెడ్డితో సహజీవనం: జయరామ్ హత్య కేసులో శిఖా పాత్రను తేల్చేసిన పోలీసులు

పారిశ్రామిక వేత్త  జయరామ్ హత్య కేసులో శిఖా చౌదరి పాత్ర ఏమీ లేదని పోలీసులు తేల్చారు. అయితే శిఖా చౌదరిపై చేసిన లక్షల రూపాయాలను తిరిగి రాబట్టుకొనే క్రమంలోనే రాకేష్ రెడ్డి జయరామ్‌ను ఎంచుకొన్నాడని  బంజారాహిల్స్ పోలీసులు చార్జీషీట్‌లో ప్రస్తావించారు.
 

కథువా రేప్ కేసు: ముగ్గురికి జీవిత ఖైదు, మిగిలినవారికి ఐదేళ్ల జైలు

కథువా రేప్ కేసులోని ఆరుగురు నిందితుల్లో ముగ్గురికి జీవిత ఖైదు విధించింది పటాన్ కోర్టు. మరో ముగ్గురికి ఈ కేసులో ఐదేళ్ల పాటు శిక్షలను విధించింది.

'మహర్షి' డైరెక్టర్ పై ట్రోలింగ్.. వరల్డ్ కప్ మ్యాచ్ లో అతి అవసరమా!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం మే నెలలో విడుదలై ఘనవిజయం సాధించింది. మహేష్ బాబు కెరీర్ లో అత్యధిక గ్రాస్ వసూలు చేసిన చిత్రంగా మహర్షి నిలిచింది. ఈ చిత్రంలో మహేష్ ని మూడు విభిన్న కోణాల్లో చూపించడంలో దర్శకుడు వంశీ పైడిపల్లి సక్సెస్ అయ్యారు. 
 

గర్భవతి అంటూ వార్తలు.. సమంత సమాధానం ఇదే!

అక్కినేని సమంత ఇటీవల వరుస విజయాలతో దూసుకుపోతోంది. సమంతకు వస్తున్న అవకాశాలన్నీ నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలే. గత ఏడాది నుంచి తీసుకుంటే.. మహానటి, రంగస్థలం, యుటర్న్, మజిలీ లాంటి చిత్రాల్లో సమంత అద్భుత నటన ప్రదర్శించింది.

ప్రముఖ నటుడు గిరీష్ కర్నాడ్ కన్నుమూత!
ప్రముఖ రంగస్థల నటుడు, రచయిత గిరీష్ కర్నాడ్(81) కన్నుమూశారు. ఇవాళ ఉదయం 6:30 గంటలకు తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.

అంతర్జాతీయ క్రికెట్ కు యువరాజ్ గుడ్ బై

టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్  సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇప్పటికు ఫామ్ లేమి కారణంగా జట్టుకు దూరమైన అతడు అంతర్జాతీయ క్రెకెట్ కు నుండి వైదొలగుతున్నట్లు తాజాగా ప్రకటించాడు. 

భారత అభిమానుల తరపున ఆసిస్ క్రికెటర్ కి కోహ్లీ క్షమాపణలు

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ... ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కి క్షమాపణలు చెప్పారు. భారత అభిమానుల తరపున కోహ్లీ ఈ క్షమాపణలు  చెప్పడం గమనార్హం.
 


 

 

Follow Us:
Download App:
  • android
  • ios