ప్రముఖ రంగస్థల నటుడు, రచయిత గిరీష్ కర్నాడ్(81) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం 6:30 గంటలకు తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1938 వ సంవత్సరం, మే నెల 19 వ తేదిన మహారాష్ట్రలో మథేరాలో జన్మించాడు గిరీష్ కర్నాడ్. తండ్రిపేరు రఘునాధ్ కార్నాడ్, తల్లి కృష్ణాబాయి.  గిరీష్ కర్నాడ్ పలు తెలుగు సినిమాలలో విలక్షణ పాత్రలు పోషించారు.

ఆనందభైరవి, శంకర్ దాదా ఎంబిబిఎస్, ప్రేమికుడు, ధర్మచక్రం, రక్షకుడు వంటి ఎన్నో  చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించారు. కన్నడసాహిత్యానికి కన్నడ చలనచిత్రరంగానికి చేసిన సేవలను గుర్తించి కర్నాటక విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చి గిరీష్ కర్నాడ్ ని సత్కరించారు.

అత్యంత ప్రతిష్ఠాకరమైన పద్మశ్రీ, పద్మభూషణ, జ్ఞానపీఠ పురస్కారాలను అందుకున్నాడు. 1972లో గిరీష్ కర్నాడ్ కు బీ.వీ.కారంత్ తో కలిపి 'వంశ వృక్ష' అనే కన్నడం సినిమాకి ఉత్తమ దర్శకునిగా జాతీయ అవార్డు లభించింది.