తిరుపతి: తన తిరుమల పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో రహస్య చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇరువురు ఏకాంతంగా మాట్లాడుకున్నట్లు చెబుతున్నారు. 

ప్రధాని మోడీ వైఎస్ జగన్ తో చర్చలు జరుపుతున్నప్పుడు మూడో వ్యక్తి లేడని సమాచారం. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణల సారాంశం ఏమిటనేది తెలిసే అవకాశం కూడా లేదు. మోడీ ఆదివారం సాయంత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విషయం తెలిసిందే. ఆయనతో పాటు జగన్ కూడా ఉన్నారు. 

శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మోడీ కొంత సేపు పద్మావతి అతిథి గృహంలో ఉన్నారు. ఆ సమయంలో మోడీ జగన్మోహన్ రెడ్డిని తన గదిలోకి పిలిచినట్లు చెబుతున్నారు. జగన్ తో ఆయన కొద్ది సేపు మాట్లాడారు. ఆ సమయంలో వారి వద్ద బిజెపి నేతలు గానీ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు గానీ లేరు.