న్యూఢిల్లీ:కథువా రేప్ కేసులోని ఆరుగురు నిందితుల్లో ముగ్గురికి జీవిత ఖైదు విధించింది పటాన్ కోర్టు. మరో ముగ్గురికి ఈ కేసులో ఐదేళ్ల పాటు శిక్షలను విధించింది.

గత ఏడాది జమ్మూ కాశ్మీర్‌లోని కథువాలో 8 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి మత్తు మందిచ్చి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి కోర్టు సోమవారం నాడు ఆరుగురిని దోషులుగా తేల్చింది. సోమవారం మధ్యాహ్నం దోషులకు శిక్షలను ఖరారు చేసింది.

సాంజీరామ్‌తో మరో ఇద్దరికి జీవిత ఖైదు విధించింది. మరో ముగ్గురికి ఐదేళ్ల పాటు జైలు శిక్షను విధించింది.

సంబంధిత వార్తలు

కథువా రేప్ కేసు: ఆరుగురిని దోషులుగా తేల్చిన కోర్టు