MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • వివాహేతర సంబంధం ఉంటే అరెస్ట్ చేస్తారా.? విజ‌య్ విష‌యంలో ఏం జ‌ర‌గ‌నుంది? చ‌ట్టం ఏం చెబుతోందంటే

వివాహేతర సంబంధం ఉంటే అరెస్ట్ చేస్తారా.? విజ‌య్ విష‌యంలో ఏం జ‌ర‌గ‌నుంది? చ‌ట్టం ఏం చెబుతోందంటే

Extramarital affair: త‌మిళ హీరో విజ‌య్ వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు తెగ వైర‌ల్ అవుతోంది. విజ‌య్ వివాహేత‌ర బంధంలో ఉన్న‌ట్లు ఆయ‌న భార్య వ్యాఖ్య‌నించింది తెలిసిందే. ఈ నేప‌థ్యంలో చ‌ట్టం ఏం చెబుతోందో ఇప్పుడు తెలుసుకుందాం. 

3 Min read
Author : Narender Vaitla
Published : Feb 28 2026, 12:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అస‌లేంటీ వివాదాం.?
Image Credit : VijayFB, Gemini AI

అస‌లేంటీ వివాదాం.?

త‌మిళ న‌టుడు విజ‌య్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు వివాదాల మధ్య నిలిచింది. తమిళగ వెట్రి కళగం (TVK) అధినేతగా రాజకీయాల్లో బిజీగా ఉన్న సమయంలో, భార్య సంగీత 27 ఏళ్ల దాంపత్యానికి ముగింపు పలుకుతూ విడాకుల పిటిషన్ దాఖలు చేయడం కోలీవుడ్‌తో పాటు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

1999లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట 2021 వరకు కలసి ఉన్నప్పటికీ, అదే ఏడాది ఏప్రిల్‌లో ఓ నటితో విజయ్‌కు ఉన్న అనుబంధం బయటపడటంతో విభేదాలు మొదలైనట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ సంబంధాన్ని ముగిస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని, తనను దూరం పెట్టారని సంగీత ఆరోపించారు. 12 పేజీల పిటిషన్‌లో ప్రత్యేక వివాహ చట్టం సెక్షన్ 27(1)(a), 27(1)(d) కింద వివాహేతర సంబంధం, మానసిక క్రూరత్వం అంశాలను ప్రస్తావిస్తూ విడాకులు కోరారు. ఈ దంపతులకు జాసన్ సంజయ్, దివ్యా షాషా అనే ఇద్దరు పిల్లలు ఉండగా, జాసన్ ప్రస్తుతం దర్శకుడిగా కెరీర్ ప్రారంభించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో వివాహేత‌ర సంబంధం ఉంటే ఎలాంటి శిక్ష ఉంటుంది.? అస‌లు చ‌ట్టం ఏం చెబుతోందో చూద్దాం.

25
వివాహేతర సంబంధం నేరమా?
Image Credit : Getty

వివాహేతర సంబంధం నేరమా?

2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన‌ తీర్పు తర్వాత వివాహేతర సంబంధం నేరం కాదని తేలింది. అంటే పోలీసులు కేసు పెట్టలేరు, అరెస్టు చేయలేరు, జైలు శిక్ష ఉండదు. ఇద్దరు అడ‌ల్ట్స్ అంగీకారంతో సంబంధం పెట్టుకుంటే అది నేరం కాదు. కేవలం వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఎవరినీ జైలుకు పంపలేరు. కానీ.. భార్య లేదా భర్తకు మానసిక హింస జరిగితే కేసు వేయవచ్చు. కుటుంబ హింస ఉంటే శిక్ష పడుతుంది. బెదిరింపులు ఉంటే క్రిమినల్ కేసు పడుతుంది. అంటే వివాహేతర సంబంధం మాత్రమే నేరం కాదు. కానీ దాని వల్ల జరిగే పనులు నేరం కావచ్చు.

Related Articles

Related image1
రోడ్డు ప‌క్క‌న క‌నిపించే ఈ కాయ‌ల గురించి తెలిస్తే అస్స‌లు వ‌దిలి పెట్ట‌రు.. ఇంత‌కీ ఇవేంటంటే
Related image2
Zodiac sign: మార్చి మొద‌టి వారం ఈ రాశి వారికి చాలా కీల‌కం.. ఒక్క‌టికి రెండు సార్లు ఆలోచించాల్సిందే
35
విడాకులకు ఎలా కారణమవుతుంది?
Image Credit : Getty

విడాకులకు ఎలా కారణమవుతుంది?

వివాహేతర సంబంధం ఫ్యామిలీ కోర్టులో విడాకులకు ప్రధాన కారణంగా ప‌రిగ‌ణిస్తారు. ఇందులో భాగంగా కోర్టు ప‌లు అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటుంది. భార్య లేదా భర్తను మోసం చేశారా, కుటుంబ జీవితాన్ని దెబ్బతీశారా, పిల్లలపై ప్రభావం ఉందా, కుటుంబ డబ్బు వృథా చేశారా, వివాహ బంధాన్ని ధిక్క‌రించారా.? వంటి అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారు. వివాహేతర సంబంధం ఎక్కువ కాలం కొనసాగితే కోర్టు "మానసిక హింస"గా పరిగణించవచ్చు. దీంతో విడాకులు త్వరగా రావచ్చు, మెయింట‌నెన్స్ ఖ‌ర్చు నిర్ణ‌యించ‌వ‌చ్చు. అలాగే పిల్లల కస్టడీ మారే అవ‌కాశం ఉంటుంది.

45
హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏం చెబుతోంది.?
Image Credit : Getty

హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏం చెబుతోంది.?

హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కూడా వివాహేతర సంబంధం విడాకులకు కారణం అవుతుంది.

* సెక్షన్ 27(1)(a) ప్రకారం భార్య లేదా భర్తలో ఎవరో ఒకరు వివాహేతర సంబంధం పెట్టుకుంటే అది విడాకులకు ప్రధాన కారణం అవుతుంది. అంటే వివాహేతర సంబంధం నిరూపిస్తే కోర్టు విడాకులు ఇవ్వవచ్చు.

* సెక్షన్ 27(1)(d) సెక్షన్ ప్రకారం భార్య లేదా భర్త మానసికంగా లేదా శారీరకంగా హింసిస్తే. దానిని క్రూరత్వం (Cruelty)గా పరిగణిస్తారు

వివాహేతర సంబంధం వల్ల అవమానం, మానసిక బాధ, కుటుంబ సమస్యలు ఉత్పన్నమైతే కోర్టు దాన్ని క్రూరత్వంగా పరిగణిస్తుంది. అంటే చాలాసార్లు వివాహేతర సంబంధం నేరం కాకపోయినా "క్రూరత్వం"గా పరిగణించి విడాకులు ఇస్తారు.

55
కోర్టులో నిరూపించాల్సి ఉంటుంది.
Image Credit : X

కోర్టులో నిరూపించాల్సి ఉంటుంది.

కేవలం అనుమానం సరిపోదు. ఆధారాలు కూడా అందించాల్సి ఉంటుంది. మొబైల్ మెసేజ్‌లు, వాట్సాప్ చాట్స్, స‌న్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు, హోటల్ బిల్లులు, ట్రావెల్ వివరాలు, బ్యాంక్ ఖర్చులు వంటివి కోర్టుకు అందించాల్సి ఉంటుంది. సంబంధం నిజమేనా, ఎప్పటి నుంచి ఉంది, కుటుంబంపై ప్రభావం ఏమిటి వంటి అంశాల‌ను కోర్టు ముఖ్యంగా చూస్తుంది. అయితే ఆధారాలు సేక‌రించే క్ర‌మంలో ఫోన్ హ్యాక్ చేయకూడదు, బెదిరించకూడదు, అక్రమంగా ఆధారాలు సేకరించకూడదు, ఇలా చేస్తే మీపై కేసు పడే అవకాశం ఉంటుంది.

ఇలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తే ఏం చేయాలి.?

వివాహేతర సంబంధం బయటపడితే వెంటనే గొడవ పడటం కంటే సరైన నిర్ణయం తీసుకోవాలి. ముందుగా ఇద్ద‌రూ క‌లిసి మాట్లాడుకోవాలి, కౌన్సిలింగ్ తీసుకోవాలి, కుటుంబ సహాయం తీసుకోవచ్చు. ఒక‌వేళ స‌ర‌ద్దుకుపోక స‌మ‌స్య మ‌రింత ఎక్కువైతే.. పరస్పర అంగీకార విడాకులు తీసుకోవచ్చు, అయితే పిల్లల భవిష్యత్తు, ఆస్తి విభజన చేయాలి, పోషణ ఖర్చు నిర్ణయించాలి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
భారత దేశం
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
తాతా.. నువ్వు తోపు అంతే ! బ్రిటన్ సామ్రాజ్యానికే అప్పు ఇచ్చిన భారతీయుడు
Recommended image2
ఢిల్లీ లిక్కర్ కేసులో ఊహించ‌ని ట్విస్ట్.. కంటతడి పెట్టుకున్న కేజ్రీవాల్, కవిత స్పందన ఏంటంటే.?
Recommended image3
PM Modi: 10 కోట్లు దాటిన మోదీ ఇన్‌స్టా ఫాలోవ‌ర్లు.. ప్ర‌ధానికి సోష‌ల్ మీడియా ద్వారా డ‌బ్బులొస్తాయా.?
Related Stories
Recommended image1
రోడ్డు ప‌క్క‌న క‌నిపించే ఈ కాయ‌ల గురించి తెలిస్తే అస్స‌లు వ‌దిలి పెట్ట‌రు.. ఇంత‌కీ ఇవేంటంటే
Recommended image2
Zodiac sign: మార్చి మొద‌టి వారం ఈ రాశి వారికి చాలా కీల‌కం.. ఒక్క‌టికి రెండు సార్లు ఆలోచించాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved