మగతనం లేదన్న భార్య.. వేరే మహిళతో సెక్స్ చేసి వీడియో పంపిన భర్త

The woman asked to tell the impotent divorce, then the husband sent her sex video and got the scandal
Highlights

వేరే మహిళతో సెక్స్  చేసి ఆ వీడియోని భార్య తల్లిదండ్రులకు పంపించాడు.

తన భర్త ఓ నపుంశకుడని.. సంసారానికి పనికిరాడని ఆరోపించింది ఓ భార్య. అంతేకాదు.. ఇవే కారణాలు  చూపి విడాకులకు కూడా అప్లై చేసింది. అయితే.. తన మీదపడిన నిందను తొలగించుకోవడానికి అతను చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వేరే మహిళతో సెక్స్  చేసి ఆ వీడియోని భార్య తల్లిదండ్రులకు పంపించాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే...హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్‌కు చెందిన విబవసు(32)కి చెన్నైలోని కొడుంగయూర్‌ ప్రాంతానికి చెందిన అనూషతో 2016లో పెళ్లయ్యింది.  పెళ్లయిన 15 రోజులకే అనూష పుట్టింటికి వచ్చేసింది. తన భర్తకు మగతనం లేదని, అతడితో కలిసి ఉండటం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. పెళ్లి కుదిర్చిన పెద్దలే వీరిని తిరిగి కలపడానికి ప్రయత్నించారు, కానీ వీలుపడలేదు. భర్త నంపుసకుడనే కారణంతో అనూష ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసింది. దీన్ని అవమానంగా భావించిన విబవసు తనపై భార్య చేసిన ఆరోపణలు తప్పని నిరూపించుకోవాలని అనుకున్నాడు. 

మరో మహిళతో అతడు శృంగారంలో పాల్గొంటుండగా.. మూడో వ్యక్తి దాన్ని వీడియో తీశాడు. తర్వాత ఆ వీడియోను తన భార్య తల్లిదండ్రులకు  పంపించాడు. అది చూసి షాకయిన అతని అత్తమామలు.. ఇలాంటి వీడియో పంపిస్తాడా అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేధింపులు, అశ్లీల వీడియోను పంపడం తదితర కారణాలు చూపుతూ పోలీసులు విబవసుపై కేసు నమోదు చేశారు. దంపతులకు వేర్వేరుగా పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించగా.. వారిద్దరి మధ్య పెళ్లికి ముందు నుంచే సరైన సంబంధాలు లేవని, పెళ్లయ్యాక కొద్ది రోజులకే గొడవలయ్యాయని చెప్పారు. పెళ్లయినా తాము శారీరకంగా కలవలేదని విబవసు పోలీసులకు తెలిపాడు.

loader