Video  

(Search results - 590)
 • ActorNaresh
  Video Icon

  ENTERTAINMENT21, Oct 2019, 8:07 PM IST

  Video: జీవితా రాజశేఖర్ తో విభేదాలు.. నరేష్ వివరణ!

  ఆదివారం రోజు జరిగిన మా అసోసియేషన్ మీటింగ్ తాను హాజరుకాకపోవడం పై నరేష్ వివరణ ఇచ్చారు. జీవిత రాజశేఖర్ తో ఉన్న విభేదాలు గురించి కూడా క్లారిటీ ఇచ్చాడు. మా అసోసియేషన్ మీటింగ్ నిర్వహిస్తే అధ్యక్షుడిగా నా అనుమతి ఉండాలి. ఆదివారం జరిగిన మీటింగ్ కు నా అనుమతి లేదు. అందుకే తాను హాజరు కాలేదు అని నరేష్ తెలిపారు.

 • Jeevitha Rajashekar
  Video Icon

  ENTERTAINMENT21, Oct 2019, 8:02 PM IST

  Video: నరేష్ లేకుండా మీటింగ్.. మాకు వాళ్ళ సపోర్ట్ ఉందన్న జీవిత!

  తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన మా అసోసియేషన్ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. మా అధ్యక్షుడు నరేష్ లేకుండానే అత్యవసర సమావేశాన్ని జీవిత, రాజశేఖర్ నిర్వహించారు. దీనితో మా అసోసియేషన్ లో గందరగోళం నెలకొంది. మా అసోసియేషన్ లో సభ్యులు నరేష్ వర్గం, జీవిత రాజశేఖర్ వర్గంగా చీలిపోయారు. ఏఈ మొత్తం ఎపిసోడ్ గురించి అనేక వార్తలు వస్తుండడంతో తాజాగా జీవిత స్వయంగా వివరణ ఇచ్చారు.

 • construction workers demands for ten thousand rupees
  Video Icon

  Vijayawada21, Oct 2019, 5:58 PM IST

  video : ఎమ్మార్వో కార్యాలయల వద్ద భవన నిర్మాణ కార్మికులు ఆందోళన

  బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా కంచికచర్ల, చందర్లపాడు, వీరులపాడు మండలాల్లోని ఎమ్మార్వో కార్యాలయల వద్ద కార్మికులు ఆందోళనకు దిగారు. సామూహిక వినతి పత్రాల సమర్పణలో భాగంగా ర్యాలీగా తాసిల్దార్ కార్యాలయం వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం వెంటనే పదివేల రూపాయలను ప్రకటించాలని ఎమ్మార్వో కార్యాలయల ముందు భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. భవన నిర్మాణ కార్మికులు ఇసుక దొరకక, కూలి పనిలేక రోడ్ల మీద పడ్డామని ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి భవన నిర్మాణ కార్మికులకు ఆర్థిక సాయం అందించాలని లేనిపక్షంలో ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

 • new roads in agency area at Commemoration Day of Police Martyrs
  Video Icon

  Andhra Pradesh21, Oct 2019, 5:24 PM IST

  video : ఏజెన్సీ గిరిజన గ్రామాల ప్రజల రోడ్డు కష్టాలు తీర్చిన పోలీసులు

  పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల సందర్భంగా ఏజెన్సీ గిరిజన గ్రామాల ప్రజల రోడ్డు కష్టాలు తీరనున్నాయి. పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలకు విచ్చేసిన పోలవరం సిఐ ఎన్ ఎన్ మూర్తి, ఎస్సై ఆర్ శ్రీనులకు ఏజెన్సీ గ్రామాల విద్యార్థుల రోడ్డు కష్టాలు విని వెంటనే స్పందించి తక్షణమే బస్సు సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకున్నారు.

 • Commemoration Day of Police Martyrs at visaka and krishna districts
  Video Icon

  Districts21, Oct 2019, 4:57 PM IST

  video :వ్యవస్థను గాడిలో పెట్టడానికి కృషి చేస్తున్న పోలీసులు

  విశాఖలో పోలీసు అమర వీరుల సంస్మరణ వేడుకలు ఘనంగా జరిగాయి.  బీచ్ రోడ్డులోని అమర వీరుల స్థూపం వద్ద అమరులకు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, నగర పోలీసు కమిషనర్ ఆర్కే మీనా, ఎస్పీ అట్టాడ బాపూజీ కలసి గౌరవ వందనం చేసి  నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ, వ్యవస్థను గాడిలో పెట్టడానికి పోలీసులు ఎంతగానో దోహదం చేస్తున్నారన్నారు. కృష్ణాజిల్లా తిరువూరులో పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు.

 • JNTU civil engineering students strike
  Video Icon

  Districts21, Oct 2019, 4:34 PM IST

  video : JNTU సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థుల ఆందోళన

  సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు విశాఖలో ఆందోళనకు దిగారు. జేఎన్ టీ యూ కాకినాడ తీరును నిరసిస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. సివిల్ ఇంజనీరింగ్ లో ఇరిగేషన్ డ్రాయింగ్ అండ్ డిజైనింగ్ సబ్జెక్టు కేవలం ల్యాబ్ కు మాత్రమే పరిమితమని తొలుత ప్రకటన చేసి, ఇప్పుడు థియరీ ఎగ్జామ్ కూడా రాయాలని పట్టుబడుతుండటంపై విద్యార్థులు వ్యతిరేకత వ్యక్తం చేసారు. విద్యార్థులకు న్యాయం చేయాలని, లేకుంటే ఆందోళనను రాష్ట్ర ఉద్యమం చేస్తామని విద్యార్థి నేతలు స్పష్టం చేసారు.

 • Road mishap in krishna district lorry hits school bus
  Video Icon

  Vijayawada21, Oct 2019, 4:20 PM IST

  video : స్కూలు బస్సును ఢీ కొట్టిన లారీ, తప్పిన ప్రమాదం

  కృష్ణాజిల్లా, అవుటపల్లి వద్ద స్కూలు బస్సును లారీ ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 15 మంది విద్యార్థులున్నారు. గన్నవరం రవీంద్రభారతి స్కూల్ బస్సును అవుటపల్లి వద్ద ఓ లారీ వెనకనుండి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు వెనకభాగం దెబ్బతిన్నది. బస్సు అద్దాలు విరిగిపోయాయి. అయితే బస్సులోని విద్యార్థులకు ఎలాంటి గాయాలూ కాలేదు.

 • three killed in an accident in kadapa
  Video Icon

  Andhra Pradesh21, Oct 2019, 3:16 PM IST

  video : చెర్వుకట్టుపై ప్రమాదం, ముగ్గురి మృతి

  కడప రెడ్డిపల్లి చెర్వుకట్టుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మనెమ్మ అనే మహిళ కువైట్ నుండి ఇండియాకు వచ్చింది. ఆమెను కొడుకు సాయికిరణ్ విమానాశ్రయం నుండి తీసుకువస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంట్లో వీరితోపాటు మరోవ్యక్తీ చనిపోయాడు.

 • Chandrababunaidu two days Tour in srikakulam
  Video Icon

  Andhra Pradesh21, Oct 2019, 2:14 PM IST

  video : శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు రెండు రోజుల పర్యటన

  శ్రీకాకుళం జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం హైదరాబాదు నుండి విమానంలో విశాఖ చేరుకున్నారు. అక్కడి నుండి రోడ్డు మార్గాన శ్రీకాకుళంలోని ఎన్టీఆర్ భవన్ కు చేరుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో రెండు రోజుల పాటు నియోజకవర్గాల వారీగా నాయకులు, కార్యకర్తలతో సమీక్షలు జరుపుతారని పార్టీ వర్గాల సమాచారం.

 • mangalagiri MlA teaches lessons to students
  Video Icon

  Districts21, Oct 2019, 1:49 PM IST

  video : విద్యార్థులకు పాఠాలు చెప్పిన MlA

  తాడేపల్లి పెనుమాక గ్రామంలో ఆదర్శ ప్రాథమిక పాఠశాలను అటుగా వెళ్తు మంగళగిరి Mla ఆళ్ళ రామకృష్ణారెడ్డి సందర్శించారు. విద్యార్థులను పలకరించి కొద్ది సేపు వారికి పాఠాలు చెప్పారు. చిన్నారులతో సరదాగా ముచ్చటించారు.

 • RTC strike video : karimnagar congress leaders house arrest pragathibhavan seize
  Video Icon

  Karimanagar21, Oct 2019, 1:31 PM IST

  RTC strike video : కరీంనగర్ కాంగ్రెస్ నాయకుల హౌజ్ అరెస్ట్

  ప్రగతి భవన్ ముట్టడికి బయల్దేరిన కరీంనగర్ కాంగ్రెస్ నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి పిలుపుమేరకు ప్రగతి భవన్ ముట్టడికి బయల్దేరిన చొప్పదండి ఇన్చార్జి మేడిపల్లి సత్యంను కరీంనగర్ పోలిసులు హౌస్ అరెస్ట్ చేసి నిర్బంధించారు. మేడిపల్లి సత్యంతో పాటు ఇతర నేతలూ ఉన్నారు.

 • fridge gas causes explosion, woman injured
  Video Icon

  Vijayawada21, Oct 2019, 1:21 PM IST

  video : ఫ్రిజ్ నుండి వెలువడిన గ్యాస్ తో పేలుడు, మహిళకు తీవ్రగాయాలు

  తాడేపల్లి టౌన్ ప్రకాష్ నగర్ లోని ఒక నివాసంలో పేలుళ్ళు కలకలం రేపాయి. తెల్లవారు జామున 4 గంటలకు పేలుడు జరిగి పైడమ్మ అనే మహిళ తీవ్ర గాయాల పాలయ్యింది. పేలుడు ధాటికి ఐరన్ గేట్స్, తలుపులు విరిగాయి. గాయపడ్డ మహిళను విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. ఫ్రిజ్ నుంచి వెలువడిన గ్యాస్ కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు అంటున్నారు.

 • fire accident in tanuku 30 lakhs properties destroyed
  Video Icon

  Districts21, Oct 2019, 1:08 PM IST

  Fire accident video : తణుకులో భారీ అగ్నిప్రమాదం..30లక్షల ఆస్తినష్టం..

  పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పట్టణంలోని 29వ వార్డు మల్లికాసులపేటలో ఓ ఇంట్లో మంటలు చెలరేగి సుమారు  40 ఇళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దాదాపు 30 లక్షల మేర ఆస్తినష్టం జరిగింది.

 • Revanth reddy arrest at pragathi bhavan pragathi bhavan muttadi
  Video Icon

  Telangana21, Oct 2019, 12:54 PM IST

  RTC strike video : ప్రగతిభవన్ ను ముట్టడించిన రేవంత్ రెడ్డి అరెస్ట్

  మల్కాజ్ గిరి ఎంపీ, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. నిన్నటి నుంచి పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న రేవంత్ రెడ్డిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ప్రగతిభవన్ ముట్టడి నేపథ్యంలో ఆదివారం సాయంత్రం నుంచి రేవంత్ రెడ్డి ఆచూకీ లేకుండా పోయారు. ప్రగతిభవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించిన రేవంత్ రెడ్డి అన్నట్లుగానే ప్రగతిభవన్ ముట్టడికి ప్రయత్నించారు.  నిన్నటి నుంచి అజ్ఞాతంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రగతిభవన్ ను ముట్టడించేందుకు బైక్ పై వచ్చారు. రేవంత్ రెడ్డిని గమనించిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఎంతమంది పోలీసులు అడ్డుకున్నా ప్రగతిభవన్ గేటును తాకుతానని చెప్పిన రేవంత్ రెడ్డి అన్నట్లుగానే ప్రగతిభవన్ గేటను తాకారు.

 • Commemoration Day of Police Martyrs celebrations
  Video Icon

  Districts21, Oct 2019, 12:46 PM IST

  video : పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

  పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల జరుపుతున్నారు. ఇందులో భాగంగా ధర్మపురిలో సోమవారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలోని శాంతి స్థూపం వద్ద పోలీసులు ,ప్రజాప్రతినిధులు పోలీసు అమరులకు ఘనంగా నివాళులర్పించారు. శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి మంత్రి ధర్మాన కృష్ణదాస్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.