అందమైన కాలేజీ అమ్మాయిలే వారి టార్గెట్. మెల్లగా పరిచయం పెంచుకొని తమపై నమ్మకం కలిగేలా చేస్తారు. ఆ తర్వాత పథకం ప్రకారం.. వారికి మత్తమందు కలిపిన కూల్ డ్రింక్ ఇస్తారు. స్పృహ కోల్పోయిన తర్వాత నగ్నంగా మార్చి.. వారిని వీడియోలు తీస్తారు. ఆ తర్వాత వాటిని చూపించి బలవంతంగా ఆ యువతులను వ్యభిచార కూపంలో దింపుతారు. లేదా వారి నగ్న వీడియోలను అమ్ముకోవడం చేసేవారు. ఆ అమ్మాయిలకు డబ్బు ఆశ చూపించి తమవైపు తిప్పుకునేలా చేసేవారు. కాగా.. ఈ ముఠా చేస్తున్న అసాంఘీక చర్యలకు పోలీసులు చరమగీతం పాడారు.

గ్యాంగ్ గుట్టును మ‌ధురై పోలీసులు ర‌ట్టు చేశారు. ఈ హైటెక్ వ్య‌భిచార దందా వెన‌క ఓ మొబైల్ షాప్ య‌జ‌మాని, హైటెక్ రెస్టారెంట్ ఓన‌ర్ ఉన్నార‌ు. తమిళనాడులో జరిగిన ఈ సంఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మ‌ధురైలోని ఓ ప్ర‌ముఖ కళాశాలకు చెందిన విద్యార్ధినులు... సమీపంలోని మొబైల్ షాప్‌లో రీఛార్జ్‌కు వెళుతుండేవారు. ఈ క్రమంలోనే...  ఆ షాపు య‌జ‌మాని, మ‌రో రెస్టారెంట్ ఓన‌ర్ క‌లిసి వాళ్ల ఫోన్ నెంబ‌ర్ల‌కు ఫోన్ చేసి ట్రాప్ చేయ‌డం మొద‌లు పెట్టారు. మేం చెప్పిన‌ట్టు వింటే మీకు కావాల్సినంత డ‌బ్బులు ఇస్తామ‌ని ఆశ పెట్టారు. మీరు ల‌గ్జరీ లైఫ్ గ‌డ‌ప వ‌చ్చ‌ని చెప్పారు. గ‌త కొంత కాలంగా ఈ తంతు న‌డుస్తోంది.

చివ‌ర‌కు ఓ విద్యార్థిని ధైర్యం చేసి పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా రంగంలోకి దిగిన పోలీసులు... ఒక్క ఫోన్ నంబర్ ఆధారంగా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. లాక్‌డౌన్ వేళ ప‌దే ప‌దే అమ్మాయిలు హాస్ట‌ల్‌, కాలేజ్ నంచి బ‌య‌ట‌కు వెళ్లి వ‌స్తున్నారు. దీంతో పోలీసులు ఆరా తీయ‌గా అస‌లు విష‌యం బ‌య‌ట ప‌డింది. ఇక ఈ వ‌ల‌లో ప‌డిన కొంద‌రు అమ్మాయిలు ఇప్ప‌టికే స‌ర్వ‌స్వం కోల్పోయార‌ట‌.

వ‌ల‌లో ప‌డిన అమ్మాయిల‌ను రెస్టారెంట్లు.. విహార యాత్ర‌లు అంటూ తీసుకువెళ్లి వారి చేతి ఖ‌ర్చుల‌కు వేలాది రూపాయ‌లు ఇచ్చి, త‌ర్వాత వారితో కామ వాచంలు తీర్చుకుని వీడియోలు తీస్తూ బ్లాక్ మెయిల్ చేయ‌డ‌మో లేదా వారిని వ్య‌భిచార కూపంలోకి దించ‌డ‌మో చేస్తున్నారు. కాగా.. వీరి వలలో ఇంకెంత మంది అమ్మాయిలు చిక్కుకున్నారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.