MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • ఎన్టీఆర్ కి అంత కోపం ఎందుకొచ్చింది? అసలు రీజన్ ఇదే...కావాలనే కొందరు...

ఎన్టీఆర్ కి అంత కోపం ఎందుకొచ్చింది? అసలు రీజన్ ఇదే...కావాలనే కొందరు...

నార్త్ బ్యాచ్ సోషల్  మీడియాలో కొందరు పనిగట్టుకుని ఎన్టీఆర్ పై నెగిటివ్ ప్రచారం మొదలెట్టారు. సౌత్ వాళ్లు ఇంతే అని..అయితే వాళ్లకు తెలియనిది ఏమిటంటే ఎన్టీఆర్ ఎంత సరదా మనిషి అనేది

3 Min read
Author : Surya Prakash
Published : Apr 26 2024, 06:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110


సాధారణంగా ఎన్టీఆర్ చాలా సరదాగా నవ్వుతూ,నవ్విస్తూ కూల్ గా ఉంటారు. ఆయన కోప్పడటం ఎప్పుడో కానీ ఎవరూ చూసి ఉండరు. కానీ తాజాగా ముంబైలో ఆయన తన గొంతు పెద్దది చేసి సీరియస్ అయ్యారు. వైరల్ అవుతున్న ఓ వీడియోలో స్పష్టంగా ఆయన కోపం కనపడుతోంది. హోటల్ రూమ్ లోకి ఆయన వెళ్తూంటే వెనకపడుతున్న ఫొటో గ్రాఫర్స్ పై ఆయన చిరాకు పడ్డారు.  
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
war2

war2

వివరాల్లోకి వెళితే...  జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర, వార్ 2 షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. హైదరాబాద్ లో దేవర షూటింగ్  చేస్తూ మరో ప్రక్క , ముంబై వెళ్లి వార్ 2 షూటింగ్ ని చేస్తూ వస్తున్నారు. ఇటీవలే వార్ 2 సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మొదటి షెడ్యూల్ ని పూర్తీ చేసి హైదరాబాద్ తిరిగి వచ్చారు. మూడు రోజుల క్రితం రెండవ షెడ్యూల్ కోసం మళ్ళీ ముంబై వెళ్లారు. ప్రస్తుతం అక్కడే వార్ 2 షూటింగ్ లో పాల్గొంటున్నారు.
 

310


ఈ క్రమంలో ఫోన్ మాట్లాడుతూ హోటల్ లోకి వెళ్తున్న ఎన్టీఆర్ ని ఫోటో తీసేందుకు కొందరు ఫోటోగ్రాఫర్స్ వెనకపడ్డారు. తన పర్మిషన్ లేకుండా ఫోటోలు తీస్తుండడంతో ఎన్టీఆర్ సీరియస్ అయ్యారు. ఓయ్ అంటూ వారి పై ఫైర్ అవుతూ అరిచారు. ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.  దీన్ని అడ్డం పెట్టి నార్త్ బ్యాచ్ సోషల్  మీడియాలో కొందరు పనిగట్టుకుని ఎన్టీఆర్ పై నెగిటివ్ ప్రచారం మొదలెట్టారు. సౌత్ వాళ్లు ఇంతే అని..అయితే వాళ్లకు తెలియనిది ఏమిటంటే ఎన్టీఆర్ ఎంత సరదా మనిషి అనేది..ఎంతలా మీడియాతో కోపరేట్ గా ఉంటారనేది. 

410


 ఎన్టీఆర్ ఇంతలా కోప్పడటానికి  కారణం..వార్ 2 చిత్రంలోని తన  లుక్ ని సీక్రెట్ గా ఉంచడం కోసం చేసిన ప్రయత్నమే  అని సమాచారం. మూవీలోని తన లుక్ ని రివీల్ చేయకూడదని ఎన్టీఆర్ చూస్తుంటే.. అక్కడి ఫోటోగ్రాఫర్స్ తన పర్మిషన్ లేకుండా ఫోటోలు తీస్తూ వస్తున్నారు. దీనివల్లే ఎన్టీఆర్ సీరియస్ అవ్వాల్సి వచ్చిందని చెబుతున్నారు. కాగా ఈ మూవీలో ఎన్టీఆర్ రా ఏజెంట్ గా కనిపించబోతున్నారు. 
 

510
ntr,war2

ntr,war2


ఇంతకు ముందు కూడా  ఎన్టీఆర్ ఎయిర్ పోర్ట్ లో విజువల్స్ వైరల్ అయ్యాయి. బ్లూ జీన్స్, వైట్ షర్ట్ వేసుకొని బ్లాక్ కళ్ళజోడు పెట్టుకొని స్టైలిష్ లుక్స్ లో అదరగొట్టాడు. దీంతో ఎన్టీఆర్ లుక్స్ వైరల్ గా మారాయి. ఇప్పుడు బాలీవుడ్ దృష్టి మొత్తం ఎన్టీఆర్ పై ఉంది. ఎన్టీఆర్ ఈ సినిమాలో క్లిక్ అవుతాడని తమ సినిమాల్లోనూ తీసుకోవచ్చు అని చూస్తున్నారు

610

యష్ రాజ్ ఫిల్మ్స్ స్సై యూనివర్స్ లో భాగంగా వస్తున్న War2లో వస్తోందన్న విషయం తెలిసిందే. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో NTR30లో నటిస్తున్నారు.  వార్ 2 షెడ్యూల్ అయ్యాక ఎన్టీఆర్ దేవర షూట్ మొదలుపెట్టబోతున్నట్టు సమాచారం. ఒక రెండు రోజులు రెస్ట్ తీసుకొని ఎన్టీఆర్ దేవర లాంగ్ షెడ్యూల్ మొదలుపెట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ ఎన్టీఆర్ షూట్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. వచ్చే నెలలో ఎన్టీఆర్ పుట్టిన రోజు ఉండటంతో దేవర నుంచి ఏమైనా అప్డేట్ ఇస్తారేమో అని ఎదురుచూస్తున్నారు అభిమానులు.జాన్వీ కపూర్ హీరోయిన్. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్లు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు.

710


ఇక RRR సినిమా తర్వాత పాన్ ఇండియా హీరో అవ్వడంతో ఎన్టీఆర్ ఆ రేంజ్ లోనే సినిమా తీసుకురావాలని ‘దేవర’తో సిద్దమవుతున్నాడు. దేవర పార్ట్ 1 సినిమాని దసరాకి రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే దేవర గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాపై ఎక్సపెక్టేషన్స్  పెంచడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా దేవర సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

810


మరో ప్రక్క దేవర సినిమాకి భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుంది. అది కూడా వంద, రెండు వందల కోట్లు కాదు అంతకుమించి బిజినెస్ జరుగుతుంది. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ దసరా కానుకగా అక్టోబర్ 10న రిలీజ్ రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మొదటి భాగం థియేట్రికల్, డిజిటల్ అండ్ ఆడియో రైట్స్ భారీ ధర పలుకుతున్నాయి. రెండు తెలుగు స్టేట్స్ థియేట్రికల్ రైట్స్ దాదాపు 130 కోట్లకు పైగా జరిగినట్లు చెబుతున్నారు.
 

910


 అలాగే సౌత్ లోని ఇతర స్టేట్స్, నార్త్ స్టేట్స్ కలిపి 50 నుంచి 60 కోట్ల బిజినెస్ జరిగినట్లు చెబుతున్నారు. ఓవర్ సీస్ రైట్స్ 27 కోట్లకు హంసిని ఎంటర్టైన్మెంట్ సొంతం చేసుకుందట. ఇక ఓటీటీ రైట్స్ ని 155 కోట్లకు నెట్‌ఫ్లిక్స్, ఆడియో రైట్స్ ని 33 కోట్లకు టి సిరీస్ సొంతం చేసుకుందట. ఈ మొత్తం కలుపుకొని 400 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కాగా శాటిలైట్ రైట్స్ ఇంకా బ్యాలన్స్ ఉంది.

1010


కళ్యాణ్ రామ్ నిర్మాణంలో మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం జాన్వీ కపూర్, శృతి మరాఠే హీరోయిన్స్ గా కనిపిస్తుంటే.. సైఫ్ అలీఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, మురళీ శర్మ వంటి స్టార్ కాస్ట్ నటిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రం పై టాలీవుడ్ టు బాలీవుడ్ భారీ అంచనాలే నెలకొన్నాయి.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Recommended image2
Irumudi: ఎక్కువ మంది ఇరుముడి సినిమాని చూస్తే, అత్యధిక కలెక్షన్లు మాత్రం పెద్దికి వచ్చాయి.. ఇదేం ట్విస్ట్
Recommended image3
ఒకప్పుడు పని లేదు, పైసా లేదు.. ఇప్పుడు ₹270 కోట్ల సినిమాతో హిట్ కొట్టిన ఈ ఐఐటీ కుర్రాడు ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved