Asianet News TeluguAsianet News Telugu

ఒక్కరి కోసం తండ్రి, కొడుకుల అడ్డదారులు... వందల కోట్ల అక్రమార్జన

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరంను సీబీఐ కస్టడీలోకి తీసుకుంది. ఈ క్రమంలో చిదంబరం ఆయన కుమారుడు కార్తీ చిదంబరం అక్రమాస్తుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.

p chidambaram money laundering case
Author
New Delhi, First Published Aug 23, 2019, 7:58 AM IST

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరంను సీబీఐ కస్టడీలోకి తీసుకుంది. ఈ క్రమంలో చిదంబరం ఆయన కుమారుడు కార్తీ చిదంబరం అక్రమాస్తుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.

2015 డిసెంబర్‌లో భాస్కర్ రామన్ అనే ఛార్టర్డ్ అకౌంటెంట్‌ను ఈడీ అరెస్ట్ చేసి... ఓ లాకర్‌ను బలవంతంగా తెరిపించింది. అందులో 4 వీలునామాలు కనిపించాయి. ఇవన్నీ ఓ నలుగురికి చెందినవి..

వారు భాస్కర్ రామన్, సీబీఎన్ రెడ్డి, రవి విశ్వనాథన్, పద్మా విశ్వనాథన్‌... అన్నీ ఒకే రోజున రాయబడగా... అన్నింటికీ సాక్షి.. వి.మురళి అనే వ్యక్తి. ఇందులో మరో విశేషం ఏంటంటే... వీలునామాలు ఒకే రూపంలో రెండు భాగాలుగా ఉన్నాయి.

ఒక భాగంలో ఇళ్లు, ఆవాసాలు,నగలు, నగదు, బ్యాంక్ ఖాతా వివరాలు భార్యాబిడ్డలకు ఇస్తున్నట్లు ఉంది. అయితే రెండో దానిలో మాత్రం విల్లు రాసిన వారు ఓ రెండు కంపెనీల్లో ఉన్న తమ వాటాలను అదితి అనే అమ్మాయికి ధారాదత్తం చేస్తున్నట్లు పేర్కొనడం అనేక ప్రశ్నలకు దారి తీసింది.

ఆ కంపెనీలు... అడ్వాంటేజ్ స్ట్రాటజిక్ కన్సల్టెంట్ ప్రైవేట్ లిమిటెడ్, క్రియా ఎఫ్ఎంసీజీ... వీటి అంతిమ లబ్ధిదారు అదితి అని స్పష్టంగా పేర్కొన్నారు. ఆమె డాక్టర్ శ్రీనిధి అనే మహిళ కుమార్తె అని... డాక్టర్ బి. రంగరాజన్ అనే వ్యక్తికి మనవరాలనీ తెలిపారు..

రంగరాజన్ తమకు స్నేహితుడు, గురువు, మార్గదర్శి, సమాజానికి ఆయన చేసిన సేవకు కృతజ్ఞతగా ఈ షేర్లను ఆయన మనవరాలికి ఇస్తున్నామని స్పష్టంగా పేర్కొన్నారు. అడ్వాంటేజ్, క్రియా ఎఫ్ఎంసీజీల్లో ఈ నలుగురికీ కలిపి... 3,00,000 షేర్లు, ఇవి కంపెనీల్లో 60 శాతం వాటాకు సమానం.

అంటే ఈ నలుగురి మరణానంతరం అదితికి అడ్వాంటేజ్‌లో 60 శాతం యాజమాన్యం దక్కుతుందన్నమాట. సుప్రసిద్ధ నేత్ర ఆస్పత్రి, కళ్లజోళ్ల విక్రయ సంస్థ అయిన ‘‘వాసన్ ఐ కేర్’’లో అడ్వాంటేజ్‌కు 60 శాతం వాటా ఉంది.. రూ. 50 లక్షలే ఇచ్చి ఆ వాటాను అడ్వాంటేజ్ కొనుగోలు చేసింది.

మిగిలిన 40 శాతం ఈక్విటీని వాసన్ సంస్థ రూ.45 కోట్లకు మారిషస్‌లోని సెకోనా క్యాపిటల్ అనే సంస్థకు విక్రయించింది. వాసన్‌లో అడ్వాంటేజ్ వాటా విలువ రూ. 67.50 కోట్లు.. ఈ కంపెనీకి సింగపూర్‌లో అడ్వాంటేజ్ స్ట్రాటజిక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే అనుబంధ సంస్థ ఉంది.

ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి. వీలునామాలు రాసిన భాస్కర రామన్, సీబీఎన్ రెడ్డి, రవి విశ్వనాథన్, పద్మా విశ్వనాథన్‌లు కార్తీ చిదంబరానికి బినామీలు.

అలాగే అడ్వాంటేజ్‌లో 40 శాతం వాటా ఉన్న మోహనన్ రాజేశ్ కార్తీ చిదంబరానికి బినామి. 2006-11 మధ్యకాలంలో అడ్వాంటేజ్‌లో 5 లక్షల షేర్లను కార్తీ... మోహనన్ పేరిట బదలాయించి, ఆ తరువాత మళ్లీ తానే తీసుకున్నట్లు ప్రముఖ పాత్రికేయుడు గురుమూర్తి బయటపెట్టారు.

అలాగే భాస్కరరామన్ చిదంబరం కుటుంబానికి ఆర్ధిక వ్యవహారాల మేనేజర్‌గా వ్యవహరించారు. ఈ నలుగురు బినామీలు వందల కోట్ల విలువైన తమ ఆస్తుల్ని బి. రంగరాజన్ అనే వ్యక్తి మీద గౌరవాభిమానాలతో ఆయన మనవరాలు అదితి పేరిట రాశారు.

ఆమె కార్తీ చిదంబరం, సునిధి చిదంబరంల కుమార్తె. ఇక బి. రంగరాజన్...సునిధి తండ్రి. చిదంబరం రాజకీయ జీవితానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసేందుకే అదితికి ఆస్తులు రాసే పత్రాల్లో రంగరాజన్ పేరును చేర్చారు.

మొత్తానికి అదితి కోసం చిదంబరం, కార్తీ చిదంబరం వందల కోట్ల ఆస్తుల్ని సంపాదించారు. షెల్ కంపెనీల ద్వారా పెట్టుబడులు, విదేశాల్లో ఖాతాలు, విల్లాలు, టెన్నిస్ క్లబ్బులు.... కూడబెట్టారు. అవన్నీ ఈడీ దర్యాప్తులో బయటపడ్డాయి.

ఐఎన్ఎక్స్ కేసులో ముగిసిన వాదనలు: తీర్పుపై ఉత్కంఠ

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరం కేసు విచారిస్తున్న అధికారి బదిలీ

నాటి సెగ....నేడు పగ: దేవుడు రాసిన స్క్రిప్ట్ లో షా, చిదంబరం

చిదంబరం అరెస్ట్: రాత్రికి సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లోనే

రాజకీయ కుట్రే: చిదంబరం అరెస్ట్‌పై కార్తీ

కేంద్ర మాజీమంత్రి చిదంబరం అరెస్ట్ : సీబీఐ హెడ్ క్వార్టర్స్ కు తరలింపు

చిదంబరం ఇంటి వద్ద హైడ్రామా: గేట్లు ఎక్కి ఇంట్లోకి వెళ్లిన సీబీఐ అధికారులు

కాంగ్రెస్ కార్యాలయం వద్ద హైడ్రామా: సీబీఐని అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు

అజ్ఞాతం వీడిన చిదంబరం: తన కుటుంబంపై కుట్ర జరుగుతోందని ఆరోపణలు

చిదంబరానికి చుక్కెదురు: ముందస్తు బెయిల్‌పై శుక్రవారం విచారణ

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరం లింకులు ఇవీ.....

ఐఎన్ఎక్స్ కేసు:చిదంబరానికి చుక్కెదురు, అరెస్ట్ తప్పదా?

చిదంబరంపై లుక్‌అవుట్ నోటీసులు... ఏ క్షణమైనా అరెస్ట్

సీజేఐ వద్దకు బెయిల్ పిటిషన్, మధ్యాహ్నం తేలనున్న చిదంబరం భవితవ్యం

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: అజ్ఞాతంలోకి చిదంబరం, గాలిస్తున్న సీబీఐ

కూతురిని హత్య చేసిన ఆమె... చిదంబరాన్ని పట్టించింది..!

Follow Us:
Download App:
  • android
  • ios