Asianet News TeluguAsianet News Telugu

మహారాష్ట్రలో దారుణం.. మైనర్ బాలికపై పోలీసు సహా 400 మంది రేప్

మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలికపై పోలీసు సహా 400 మంది లైంగికదాడికి పాల్పడ్డారు. ఆరు నెలల పాటు ఆమెపై ఈ అఘాయిత్యం జరిగింది. తల్లిని కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉండగా తండ్రి పెళ్లి చేశాడు. కానీ, అత్తింటి వారు వేధింపులు పెట్టడంతో తాళలేక సొంతకాళ్లపై బతకాలని మరో పట్టణానికి వెళ్లిన ఆ బాలికపై అత్యాచారం చేశారు.

minor girl raped by over 400 people in maharashtra
Author
Mumbai, First Published Nov 14, 2021, 5:15 PM IST

ఔరంగాబాద్: Maharashtraలోని బీడ్ జిల్లాలో ఓ Minor బాలికపై ఏకంగా నాలుగు వందల మంది లైంగిక దాడి(Rape)కి పాల్పడ్డారు. ఇందులో ఓ పోలీసు కూడా ఉన్నట్టు తెలిసింది. కనీసం ఆరు నెలల వ్యవధిలో వీరు నిస్సహాయురాలైన తల్లిలేని బాలికపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. తల్లిని కోల్పోయిన ఆ బాలికను తండ్రి ఓ ఇంటికి ఇచ్చి పెళ్లి చేశాడు. కానీ, మెట్టినింటిలోనూ ఆమెకు సంతోషంగా లభించలేదు. మామ తరుచూ ఆమెను వేధించేవాడు. అత్తింటి వారి వేధింపులు తట్టుకోలేక తిరిగి పుట్టినింటికి వచ్చింది. కానీ, ఎంతోకాలం తండ్రికి భారంగా మారాలని భావించలేదు. అందుకే ఉద్యోగాన్ని వెతుక్కుంటూ మరో పట్టణానికి వెళ్లింది. ఆ బాలిక నిస్సహాయతను ఆసరాగా తీసుకుని కొందరు దుండగులు ఆమెపై అత్యాచారం చేశారు.

ఈ విస్మయకర ఘటన మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. కేసు వివరాల ప్రకారం, బాధితురాలి తల్లి రెండేళ్ల క్రితం మరణించింది. కొంత కాలం తర్వాత తండ్రి ఆ మైనర్ బాలికకు పెళ్లి చేశాడు. ఆ బాలిక భర్తతో సుమారు ఏడాది పాటు ఉంది. కానీ, అక్కడ మామ వేధింపులు ఎక్కువ అయ్యాయి. దీంతో ఆమె తిరిగి తండ్రి దగ్గరకు వచ్చింది. కొన్ని రోజులు ఇంటిలో ఉన్న తర్వాత స్వయంగా ఉద్యోగం చేసుకోవాలని తలచింది. ఆర్థికంగా తన కాళ్లపై తాను నిలబడాలని ప్రయత్నించింది. అందులో భాగంగానే ఉద్యోగ వేటలో అంబెజోగాయ్ టౌన్‌కు వెళ్లింది. ఉద్యోగం కోసం ప్రయత్నాలు తీవ్రం చేసింది. కానీ, అంత సులువుగా అవకాశాలు కానరాలేదు.

Also Read: పని ఇప్పిస్తామని తీసుకెళ్లి... యువతికి మద్య తాగించి, అత్యాచారం.. వీడియోలు తీసి...దారుణం..

నిస్సహాయురాలైన ఆ బాలిక అవసరాన్ని కొందరు దుండగులు కనిపెట్టారు. ఆ అవసరాన్నే ఆధారంగా చేసుకుని ఆమెపై లైంగిక దాడికి ప్లాన్ వేశారు. ఉద్యోగం ఇప్పిస్తామనే హామీ ఇచ్చి ఇద్దరు దుండగులు ఆమెపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత చాలా మంది ఆమెపై లైంగిక దాడిక ిపాల్పడ్డారు. ఇందులో ఓ పోలీసు అధికారి కూడా ఉన్నట్టు సమాచారం. మొత్తంగా ఆమెపై సుమారు 400 మంది అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ మైనర్ ఇప్పుడు గర్భం దాల్చింది.

చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఇప్పుడు ఆమెకు అబార్షన్ చేసే పనిలో ఉన్నది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Also Read:నాలుగేళ్ల చిన్నారిపై రేప్: నిందితుడికి నెల రోజుల్లోనే జీవిత ఖైదు

ఇటీవలి వారాల్లోనే మహారాష్ట్రలోని డోంబివలీలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. తనపై 33 మంది యువకులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారని ఓ మైనర్ బాలిక ఆరోపణలు చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ 22వ తేదీ వరకు డోంబివలీ ఏరియాలో పలుచోట్ల వేర్వేరు సమయాల్లో వారు తనపై గ్యాంగ్ రేప్‌నకు పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. జనవరిలో ఓ దుండగుడు తనపై లైంగిక దాడికి పాల్పడి అందుకు సంబంధించిన ఘటనను వీడియో తీశాడని తెలిపింది. ఆ వీడియో ద్వారానే ఇతరులూ తనపై బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడ్డారని వివరించింది. వీడియోను చూపెట్టి బ్లాక్‌మెయిలింగ్ చేస్తూ రేప్ చేశారని ఆరోపించింది. బాలిక ఫిర్యాదు ఆధారంగా నిందితులపై పోక్సో చట్లం సహా పలు సెక్షన్‌ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios