Asianet News TeluguAsianet News Telugu

పని ఇప్పిస్తామని తీసుకెళ్లి... యువతికి మద్య తాగించి, అత్యాచారం.. వీడియోలు తీసి...దారుణం..

ఓ యువతి (21)ని పని ఇస్తామని తనవెంట రమ్మని బలవంతపెట్టారు. పట్టణ శివారులో  పని ఉందని, కూలీ డబ్బులు ఎక్కువ ఇప్పిస్తామని చెప్పి వారి ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని... ఫతేపూర్ మైసమ్మ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. 

young woman was drunk and raped by two men in mahabubnagar district
Author
Hyderabad, First Published Nov 13, 2021, 8:12 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

పాలమూరు :  త్వరలో వివాహం కావలసిన యువతికి పని చూపిస్తామని తీసుకెళ్లి మద్యం తాగించి, అత్యాచారం చేసిన ఘటన ఇది. మహబూబ్ నగర్ టౌన్ సిఐ రాజేశ్వర్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... కోయిలకొండ మండలం మల్కాపురం గ్రామానికి చెందిన రాజేందర్ రెడ్డి అలియాస్ రాజు (35), మహబూబ్ నగర్ మండలం  కోటకదిర గ్రామానికి చెందిన ఆంజనేయులు (27) పెయింటర్లుగా పనిచేస్తున్నారు. 

ఇద్దరు married వ్యక్తులే. రోజు జిల్లా కేంద్రంలోని TD gutta ప్రాంతానికి వచ్చి నిలబడి పని దొరికిన చోటుకు వెళుతుంటారు. ఈ నెల 5న అదే అడ్డాలో ఓ యువతి (21)ని పని ఇస్తామని తనవెంట రమ్మని బలవంతపెట్టారు. పట్టణ శివారులో  పని ఉందని, కూలీ డబ్బులు ఎక్కువ ఇప్పిస్తామని చెప్పి వారి ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని... ఫతేపూర్ మైసమ్మ forest areaకి తీసుకెళ్లారు. 

అక్కడ యువతికి liquor తాగించి, rapeకి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను తమ cellphoneలో బంధించారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని భయ పెట్టారు. ఈనెల 18న ఆమెను వివాహం కావాల్సి ఉండడంతో.. దాన్ని చెడగొట్టాలని భావించి ఫోన్ లో తీసిన చిత్రాలను ఈ నెల 10న యువతి కాబోయే భర్తకు వాట్స్అప్ ద్వారా పంపించారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

షాక్ అయిన యువతి family members అదే రోజున పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.  శుక్రవారం టీడీగుట్ట అడ్డాలో ఉన్న యువకులను అరెస్టు చేశారు.

అమీర్‌పేట మెట్రోస్టేషన్ నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం.. ఆసుపత్రికి తరలింపు

మరో కథనం ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం కోత్లాబాద్ కి చెందిన సదరు యువతి ప్రతిరోజూ మహబూబ్ నగర్ కు వచ్చి దినసరి కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తోంది. అయితే మల్కాూపూర్ కి చెందిన రాజేందర్ రెడ్డి అలియాస్ రాజు కొత్లాబాద్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.

ప్రస్తుతం ఆమె తల్లిగారి ఇంటి వద్ద ఉండటంతో రాజు కూడా ప్రతిరోజూ కొత్లాబాద్‌ నుంచి బైక్‌పై మహబూబ్ నగర్ కు వచ్చి పెయింటింగ్ పని చేసేవాడు. ఈ క్రమంలో దినసరి కూలీగా పని చేసే అమ్మాయిని రాజు చాలా సార్లు బైక్ మీద ఎక్కించుకుని రావడంతో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఈ నెల 5న ఆ అమ్మాయి పని కోసం జిల్లా కేంద్రంలోని టీడీగుట్ట గేటు దగ్గరకు వచ్చింది. ఆ రోజు పని దొరకకపోవడంతో రాజు అతని స్నేహితుడు, ఆంజనేయులు కలిసి ఆమె వద్దకు వెళ్లారు. 

వేరే చోట పని ఇప్పిస్తామని చెప్పి bike మీద ఎక్కించుకుని ఫతేపూర్ అడవిలోకి తీసుకెళ్లారు. అక్కడ ఇద్దరూ ఆమెకు బలవంతంగా మద్యం తాగించి, లైంగిక దాడికి పాల్పడ్డారు. రాజు rape చేసేటప్పుడు ఆంజనేయులు ఫొటోలు, వీడియోలు తీశాడు. విషయం చెబితే చంపేస్తామని బెదిరించారు. కాగా ఈ నెల 18న ఆ అమ్మాయికి పెళ్లి జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వారు ఆ marriageని చెడగొట్టాలని లైంగిక దాడి photos, videos సదరు పెళ్లి కొడుకు whatsappకు పంపారు.

Follow Us:
Download App:
  • android
  • ios