Asianet News TeluguAsianet News Telugu

ఒకరిని గర్భవతిని చేసి... మరొకరితో పెళ్లి పీటలు ఎక్కాడు

మాయ మాటలు చెప్పి ఓ మహిళకు దగ్గరయ్యాడు. ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. ఆమె ప్రేమను అంగీకరించాక.. వలపు ఎర వేసి మరింత దగ్గరయ్యాడు. తీరా ఆమెతో శారీరక ఆనందాన్ని పొంది.. పెళ్లికి నిరాకరించాడు. 

man arrested for cheating women in karnataka
Author
Hyderabad, First Published May 9, 2019, 11:22 AM IST

మాయ మాటలు చెప్పి ఓ మహిళకు దగ్గరయ్యాడు. ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. ఆమె ప్రేమను అంగీకరించాక.. వలపు ఎర వేసి మరింత దగ్గరయ్యాడు. తీరా ఆమెతో శారీరక ఆనందాన్ని పొంది.. పెళ్లికి నిరాకరించాడు. పెళ్లికి బలవంతపెట్టడంతో ముఖం చాటేశాడు. అనంతరం మరో యువతితో పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్దమయ్యాడు. బాధిత మహిళ ఫిర్యాదుతో జైల్లో ఊచలు లెక్కపెట్టుకుంటున్నాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే... పట్టణ శివారులోని జాలప్ప కళాశాల క్వార్టర్స్‌ వద్ద నివసిస్తున్న వివాహిత యువతి (24) భర్తకు దూరంగా ఉంటోంది. ఆమె పట్టణంలోని కోర్టు రోడ్డులో ఉన్న బుల్లెట్‌ జిమ్‌కు సంవత్సరం నుండి ఫిట్‌నెస్‌ కోసం నిత్యం వచ్చేది. ఈ క్రమంలో జిమ్‌ ఓనర్‌ గౌతమ్‌ మాటలు కలిపి పరిచయం పెంచుకుని కొద్ది రోజులకు ప్రేమిస్తున్నానని చెప్పాడు.

పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మబలికాడు. భర్తకు విడాకులు ఇచ్చి వస్తే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. జిమ్‌లో, బెంగళూరు రోడ్డులోని ఒక అపార్ట్‌మెంటు గదిలో, హోటల్‌ రూంలలో అనేకసార్లు ఆమెతో సెక్స్ లో పాల్గొన్నాడు. దీంతో ఆమె గత నెల గర్భం దాల్చింది. గౌతమ్‌కు చెప్పడంతో పెళ్లికి నిరాకరించాడు. ఈ విషయం గౌతమ్‌ తండ్రికి చెప్పినా ఆయన పట్టించుకోలేదు. 

దీనికి తోడు.. ఘాటిక్షేత్రంలో తన కొడుక్కి మరో యువతితో బుధవారంనాడు వివాహం చేయడానికి ఏర్పాట్లు చేశాడు. దీంతో యువతి తన వద్ద ఉన్న సాక్ష్యాధారాలతో పోలీసులకు ఫిర్యాదుచేసింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు తండ్రీ, కొడుకును అరెస్టు చేశారు. అసలు గౌతమ్.. అమ్మాయిలను ఆకర్షించేందుకే జిమ్ మొదలుపెట్టాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇప్పటివరకు చాలా మంది యువతులను మోసం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios