Asianet News TeluguAsianet News Telugu

ప‌శువుల మేత‌కు వెళ్లిన మ‌హిళ‌ కిడ్నాప్.. 36 రోజుల పాటు గ్యాంగ్ రేప్.. 3 ల‌క్ష‌లు ఇచ్చిన త‌రువాత విడుద‌ల

రాజస్థాన్ లో ఘోరం జరిగింది. ఓ మహిళను కిడ్నాప్ చేసి దాదాపు నెల రోజులకు పైగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత కుటుంబం నుంచి రూ.3 లక్షలు వసూలు చేసి ఆమెను విడుదల చేశారు. 

Kidnapping of a woman who went to graze cattle.. Gang rape for 36 days.. Released after giving 3 lakhs
Author
First Published Sep 24, 2022, 9:52 AM IST

రాజస్థాన్‌లోని నుహ్‌లో హృదయ విదారక ఉదంతం వెలుగులోకి వచ్చింది. ప‌శువుల మేత కోసం వెళ్లిన మ‌హిళ‌ను అప‌హ‌రించి 36 రోజుల బంధించి సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. అనంత‌రం బాధితురాలి కుటుంబ స‌భ్యులు దుండ‌గుల‌కు రూ.3 ల‌క్ష‌లు ఇస్తేనే ఆమెను విడుద‌ల చేశారు. అంత‌కు ముందు ఆ మ‌హిళకు సంబంధించి అభ్యంత‌ర‌కర‌మైన వీడియోను రికార్డ్ చేశారు.

బీహార్‌లో ప్రధాని మోదీపై దాడికి పీఎఫ్‌ఐ కుట్ర.. ఈడీ దర్యాప్తులో వెలుగులోకి సంచలన విషయాలు..!

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పుహానా పోలీస్ స్టేషన్‌లో కేసు న‌మోదు అయ్యింది. ఫిర్యాదులో బాధితురాలు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. 45 ఏళ్ల బాధితురాలు జూలై 27వ తేదీన ప‌శువులు మేత కోసం పొలానికి వెళ్లింది. ఈ స‌మ‌యంలో ఓ కారులో ముగ్గురు వ్య‌క్తులు ఆమె వ‌ద్ద‌కు చేరుకున్నారు. తుపాకీతో బెదిరించి ఆమెను కారులో బ‌లవంతంగా ఎక్కించుకున్నారు. అనంత‌రం కిడ్నాప్ చేశారు.

వ్యభిచారంలోని దింపడాన్ని వ్యతిరేకించిందని రిసెప్షనిస్ట్ హత్య.. బీజేపీ నేత కుమారుడి అరెస్ట్..

నిందితులు ఆమెను రాజస్థాన్‌లోని ఒక గ్రామానికి తీసుకెళ్లి ఇంట్లోని గదిలో బంధించారు. అనంత‌రం ఆమెకు మ‌త్తు ముందు ఇచ్చి పదేపదే సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఇలా దాదాపు 36 రోజుల పాటు ఆమెపై అఘాయిత్యానికి ఒడిగ‌ట్టారు. ఈ స‌మ‌యంలో ఆ మ‌హిళ‌కు అభ్యంతరకరమైన వీడియోను రూపొందించారు. ఆ వీడియోను ఇంటర్నెట్‌లో పెడుతామ‌ని బెదిరించారు. దానిని ఆప్ లోడ్ చేయ‌కుండా ఉండాలంటే మహిళ కుటుంబం రూ.3 లక్షలు చెల్లించాల‌ని డిమాండ్ చేశారు. 

‘నా డెత్ సర్టిఫికెట్ పోయింది’ అంటూ ప్రకటన..! ముక్కున వేలేసుకుంటున్న నెటిజన్లు.. పోస్ట్ వైరల్..

బాధిత కుటుంబ స‌భ్యులు చేసేదేమీ లేక దుండుగులు డిమాండ్ చేసిన రూ.3 ల‌క్ష‌ల‌ను ఇచ్చేశారు. దీంతో బాధితురాలిని సెప్టెంబర్ 1వ తేదీన విడుద‌ల చేశారు. అనంత‌రం ఆమె పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని, వాస్తవాలను ధృవీకరిస్తున్నామని నూహ్ పోలీసు సూపరింటెండెంట్ వరుణ్ సింగ్లా తెలిపారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామ‌ని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios