Asianet News TeluguAsianet News Telugu

వ్యభిచారంలోని దింపడాన్ని వ్యతిరేకించిందని రిసెప్షనిస్ట్ హత్య.. బీజేపీ నేత కుమారుడి అరెస్ట్..

యువతి హత్య కేసులో బీజేపీ నేత వినోద్ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్యను ప్రధాన నిందితుడిగా పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో త్రివేంద్ర సింగ్ రావత్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో వినోద్ ఆర్య సహాయ మంత్రిగా ఉన్నారు.

Uttarakhand ex-minister's son held for killing 19-yr-old
Author
First Published Sep 24, 2022, 7:23 AM IST

ఉత్తరాఖండ్ :  ఉత్తరా ఖండ్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ రిసార్టులో 19 ఏళ్ల యువతి రిసెప్షనిస్ట్ గా పనిచేస్తుంది. ఆ యువతి హత్యకు గురికావడం కలకలం రేపింది. అయితే ఈ వ్యవహారంలో రిసార్ట్ యజమానే ఈ దారుణానికి పాల్పడినట్లు వెల్లడైంది. దీంతో  అతడితోపాటు అదే రిసార్ట్ లో పనిచేస్తున్న మరో ఇద్దరు సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరాఖండ్ హరిద్వార్ కు చెందిన వినోద్ ఆర్య అనే బీజేపీ నేతకు పౌరీ జిల్లాలో ఓ రికార్డు ఉంది. అందులో పనిచేస్తున్న 19 ఏళ్ల యువతి గత కొంతకాలంగా కనిపించకుండా పోయింది.  

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో ఆ యువతి చివరగా రిసార్టులోనే కనిపించిందని తేలింది. దీంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. వారి దర్యాప్తులో వెలుగుచూసిన విషయాలు షాక్ కు గురి చేసేలా ఉన్నాయి. ఆ యువతిని బీజేపీ నేత కుమారుడు, రిసార్ట్ యజమానిగా ఉన్న పులకిత్ ఆర్య, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్లు కలిసి హతమార్చినట్లు దర్యాప్తులో వెల్లడయింది. ఆ తరువాత తమ నేరం బయటపడకుండా ఉండాలని..  ఆమె మృతదేహాన్ని సమీప కాలువలో పడేశారు. 

పోలీసుల విచారణలో నిందితులు తేలడంతో వారిని అరెస్ట్ చేసి విచారించగా.. ఈ విషయాన్ని నిందితులు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులు చెప్పిన వివరాల ప్రకారం  అమ్మాయి మృతదేహాన్ని కనుగొనేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు ఏసీబీ శేఖర్ చంద్ర వెల్లడించారు.  నిందితులను కోర్టులో హాజరుపరచగా వారికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించినట్లు తెలిపారు.

ఐదు రోజుల క్రితం అదృశ్యమైన లక్ష్మణ్ ఝూలా ప్రాంతంలోని రిసార్ట్‌లో పనిచేస్తున్న 19 ఏళ్ల మహిళ రిసెప్షనిస్ట్‌ను హత్య చేసిన కేసులో ఉత్తరాఖండ్‌లోని బిజెపి మాజీ మంత్రి కుమారుడుతో పాటు ముగ్గురిని రాష్ట్ర పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ కేసులో బీజేపీ నేత వినోద్ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్యను ప్రధాన నిందితుడిగా పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో త్రివేంద్ర సింగ్ రావత్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో వినోద్ ఆర్య సహాయ మంత్రిగా ఉన్నారు.

‘నా డెత్ సర్టిఫికెట్ పోయింది’ అంటూ ప్రకటన..! ముక్కున వేలేసుకుంటున్న నెటిజన్లు.. పోస్ట్ వైరల్..

అంకితా భండారీగా గుర్తించిన మహిళ మృతదేహం ఇంకా లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. భండారీ పౌరీ గర్వాల్‌లోని శ్రీకోట్ గ్రామానికి చెందిన యువతి. నెల రోజుల క్రితమే రిసార్ట్‌లో రిసెప్షనిస్ట్‌గా చేరిందని పోలీసు వర్గాలు తెలిపాయి. హత్య వెనుక ఉన్న కారణాల్లోకి వెడితే..  నిందితులు ఆమెను వ్యభిచారంలోకి దింపడానికి చేసిన ప్రయత్నాలను మహిళ ప్రతిఘటించడం వల్లే చంపేశారనే ఆరోపణల గురించి అడిగినప్పుడు, పౌరీ గర్వాల్ SSP యస్వంత్ సింగ్ మాట్లాడుతూ పోలీసులు "అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నారు" అని చెప్పారు.

“నిందితులు తనను ఇబ్బందిపెడుతున్నారని బాలిక ఫోన్ చాట్‌లో ఉంది. రిషికేశ్‌ను సందర్శించేందుకు బాలిక తమతో పాటు రాత్రి 8 గంటల సమయంలో రిసార్ట్‌ నుంచి బయలుదేరిందని నిందితులు తెలిపారు. అక్కడ, వారు మోమోలు, మద్యం తాగారు, తరువాత కాలువ సమీపంలో పుల్కిత్, అంకిత మధ్య వాగ్వాదం జరిగింది. గొడవ జరుగుతున్న సమయంలో అంకిత పుల్కిత్ ఫోన్‌ని కాల్వలోకి విసిరేసింది. దీంతో కోపానికి వచ్చిన పుల్కిత్ ఆమెను కాలువలోకి నెట్టాడు’’ అని ఎస్‌ఎస్పీ తెలిపారు.

పుల్కిత్ కాకుండా, అరెస్టయిన వారిలో రిసార్ట్ మేనేజర్ సౌరభ్ భాస్కర్, అంకిత్ అనే మరో వ్యక్తి ఉన్నట్లు ఎస్ఎస్పీ తెలిపారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ సంఘటనను "చాలా విచారకరం, దురదృష్టకరం" అని అభివర్ణించారు. బాధ్యులకు "కఠిన శిక్ష" విధించబడుతుందని అన్నారు. పోలీసులు తమ పని తాము చేసుకుపోతున్నారని, బాధితురాలికి న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు.

“అమ్మాయిని చిల్లా పవర్ హౌస్ కెనాల్‌లోకి తోసేశామని నిందితులు ఒప్పుకున్నారని ఎస్‌ఎస్పీ యశ్వంత్ సింగ్ తెలిపారు.  దీంతో మిస్సింగ్ కేసు హత్య కేసుగా మారుతుందని పోలీసులు చెబుతున్నారు. అయితే, తమకు ఇంకా మృతదేహం దొరకలేదని, తొలుత ఐపీసీ సెక్షన్ 365 (కిడ్నాప్) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాం.  IPC సెక్షన్లు 302 (హత్య), 201 (సాక్ష్యం అదృశ్యం లేదా తప్పుడు సమాచారం ఇవ్వడం) దీనికి యాడ్ చేశాం.. అని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios