పెట్రోల్, ఛార్జింగుకి బై బై.. ఇండియాలోనే ఫస్ట్ బైక్.. సామాన్యులకి పండగే..
బజాజ్ బ్రూజర్(Bajaj Bruzer) పేరుతో ఈ బైక్‌ను విడుదల చేయవచ్చని అంటున్నారు. ఈ బైక్ 110-125సీసీ సెగ్మెంట్‌లోని పెట్రోల్‌తో నడిచే బైక్స్ తో పోటీపడనుంది.
బజాజ్ ఆటో జూన్‌లో CNGతో నడిచే కమ్యూటర్ బైకును విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. వచ్చే నెల 18న ఈ బైక్‌ను విడుదల చేసే అవకాశం ఉందని కూడా కొందరు చెబుతున్నారు. అయితే ఈ బైక్ భారతదేశపు మొట్టమొదటి CNG పవర్డ్ బైక్ అని బజాజ్ తెలిపింది.
బజాజ్ బ్రూజర్(Bajaj Bruzer) పేరుతో ఈ బైక్‌ను విడుదల చేయవచ్చని అంటున్నారు. ఈ బైక్ 110-125సీసీ సెగ్మెంట్‌లోని పెట్రోల్‌తో నడిచే బైక్స్ తో పోటీపడనుంది. లేటెస్ట్ అప్‌డేట్‌ల ఆధారంగా, బజాజ్ లుక్ అండ్ ఫంక్షన్ పరంగా కొత్త డిజైన్‌ను అందించడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.
పొడవైన సీటు, సన్నగా ఉండేల ఇంకా టెయిల్ ప్యానెల్‌లు స్పష్టంగా కనిపిస్తాయి. బ్రేస్డ్ హ్యాండిల్ బార్, knuckle guard కూడా ఉంటుంది. టైర్ 2 నగరాల్లో ఎదురయ్యే కఠినమైన రోడ్లపై సవాలు చేసే రైడ్‌ను అందించడానికి ఈ బైక్ నిర్మించబడింది.
ఛాసిస్ పూర్తిగా కొత్తగా ఉంటుంది. ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుకవైపు మోనోషాక్‌తో వస్తుంది. బైక్‌కు ముందు భాగంలో డిస్క్ బ్రేక్ అలాగే వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్ ఉంటుంది.
ఇంజన్ డిస్‌ప్లేస్‌మెంట్, ట్యాంక్ కెపాసిటీ వంటి బైక్ గురించి ఇతర వివరాలు అధికారికంగా లాంచ్ అయ్యే సమయంలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.
CNG బైక్ అనేది ప్రతిరోజు దూర ప్రయాణీకుల అవసరాలను తీర్చే బైక్. పెట్రోల్ బైక్‌ల కంటే సీఎన్‌జీ బైక్‌లు చౌకగా ఉండటం మరో ప్రత్యేకత. మొట్టమొదటి బజాజ్ CNG బైక్ ద్విచక్ర వాహన మార్కెట్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి సిద్ధంగా ఉంది.