Bengaluru Metro: బెంగుళూరు మెట్రోలో సమాజం సిగ్గుతో తలదించుకునే ఓ సంఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది.

Bengaluru Metro :ఇటీవల వింత ఘటనలతో బెంగుళూరు మెట్రో కూడా తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ప్రయాణికుల వింత చేష్టలు, లవర్స్ రొమాన్స్‌, యూత్ డ్యాన్స్ రీల్స్, మహిళ ఘర్షణలు వంటి వీడియోలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ క్రమంలో హెచ్చరికలు జారీ చేశారు బెంగుళూరు మెట్రో అధికారులు. మెట్రో లో అభ్యంతరకర ప్రవర్తించడం, తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగే చేష్టలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తాజాగా మరో వీడియోతో సోషల్‌ మీడియాలో మారింది. 

బెంగుళూరు మెట్రో రైలు కోచ్‌లో సిగ్గుతో తలదించుకునే ఓ సంఘటన జరిగింది. ఒక యువ జంట రెచ్చిపోయాయి. ప్రేమలో మునిగిపోయిన ఆ జంట బయటి ప్రపంచాన్ని మర్చిపోయి ట్రైన్ లో రొమాన్స్ చేసుకుంటూ.. ముద్దు పెట్టుకోవడం ప్రారంభించారు. ఈ ఘటనను తోటీ ప్రయాణీకుడు చిత్రీకరించింది. సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (video viral on social media)గా మారింది.

దీంతో ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి ప్రవర్తన వల్ల చుట్టుపక్కల వారికి చాలా ఇబ్బంది కలుగుతుందని అంటున్నారు. వైరల్ వీడియోలో మెట్రోలో ఒక యువ జంట ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడం స్పష్టంగా చూడవచ్చు. బహిరంగ ప్రదేశాల్లో మర్యాద, గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన ఎత్తి చూపిందని ఓ ప్రయాణికుడు వ్యాఖ్యానించారు. ఇది చాలా ఆందోళన కలిగించే అంశం. దీనిపై ఫిర్యాదు చేస్తుండగా మరో ప్రయాణికుడు బెంగుళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ మరియు బెంగళూరు సిటీ పోలీసులను ఎక్స్‌లో ట్యాగ్ చేశాడు.

Scroll to load tweet…