తనను హత్య చేసేందుకు కుట్ర చేస్తున్నారని బీజేపీ మాజీ ఎమ్మెల్యే గాలి జనార్థన్ రెడ్డి ఆరోపించారు. తప్పుడు కేసులతో తనను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంబిడెంట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కేసులో గాలి జనార్ధన్ రెడ్డిని సీసీబీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

కాగా.. నాలుగురోజుల పాటు పరప్పన అగ్రహార జైలులో ఉన్న ఆయన బెయిలు పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో తన ప్రాణాలకు ముప్పు ఉందని తగిన రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తనకు వ్యతిరేకంగా ఏదో కుట్ర జరుగుతోందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు.

అంబిడెంట్‌ సంస్థతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. న్యాయమే గెలుస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ దురద్దేశంతోనే తనను ఈ కేసులో ఇరికించారని ఆయన అభిప్రాయపడ్డారు. 

ఈ వార్తలు కూడా చదవండి

గాలి అరెస్ట్.. మరో ముగ్గురి కోసం గాలింపు

పోంజి స్కామ్‌లో గాలి అరెస్ట్.. రూ.18 కోట్లు లంచం తీసుకున్నందుకు..

పోలీసులకు లొంగిపోనున్న గాలి..?

హైదరాబాదులోని ఫ్రెండ్ ఇంట్లో గాలి: తృటిలో గాయబ్

ఇంట్లో సోదాలు: అధికారులతో గొడవకు దిగిన గాలి అత్త

పరారీలో గాలి జనార్దన్ రెడ్డి: బయటపడిన షాకింగ్ విషయాలు

పోలీసు వేట: గాలి జనార్దన్ రెడ్డి హైదరాబాదులో ఉన్నారా...

పరారీలో గాలి జనార్థన్ రెడ్డి...ఎమ్మెల్యే శ్రీరాములు ఏమన్నారంటే

అంబిడెంట్ కంపెనీతో డీల్: పరారీలో గాలి జనార్ధన్ రెడ్డి

కాంగ్రెస్ 14 ఏళ్ల నిరీక్షణ... ‘‘గాలి’’ కోటలో హస్తం పాగా

గాలి వివాదం: ఏపీ, కర్నాటకలకు సుప్రీం వార్నింగ్