బీజేపీ మాజీ నేత గాలి జనార్థన్ రెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్న సంగతి తెలిసిందే.  కాగా.. ఈ విషయంపై తొలిసారిగా గాలి ప్రధాన అనుచరుడు, బీజేపీ  ఎమ్మెల్యే శ్రీరాములు స్పందించారు.

ఈ విషయం గురించి తనకు తెలియదని, మీడియాలో చూసిన తర్వాతే తెలుసుకున్నానని ఆయన తెలిపారు. తనకు ఎలాంటి సమాచారం అందలేదన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఎవరూ చట్టానికి అతీతులు కారని శ్రీరాములు వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. గాలి జనార్ధనరెడ్డి తాజా చిక్కులకు కారణం ఆయన అంబిడెంట్ అనే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడమేనని తెలుస్తోంది. 

అంబిడెంట్‌ను ఈడీ నుంచి కాపాడేందుకు ఆ కంపెనీతో గాలి డీల్ కుదుర్చుకున్నారు. ఇందు కోసం ఈడీ అధికారికి గాలి జనార్ధన్‌రెడ్డి కోటి లంచం ఇచ్చినట్లు సమాచారం. దీనికి ప్రతిఫలంగా ఆయన అంబిడెంట్ కంపెనీ నుంచి 57 కిలోల బంగారు కడ్డీలు అందుకున్నారు. ఈ కేసు నేపథ్యంలో గాలి జనార్ధన్‌రెడ్డి కోసం వేట కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

అంబిడెంట్ కంపెనీతో డీల్: పరారీలో గాలి జనార్ధన్ రెడ్డి