బీజేపీ మాజీ ఎమ్మెల్యే గాలి జనార్థన్ రెడ్డి సీసీబీ లొంగిపోనున్నాడా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. అంబిడెంట్‌ మార్కెటింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నిర్వాహకులకు కేసుల నుంచి విముక్తి కలిగించేలా గాలి జనార్దనరెడ్డి రూ.20కోట్ల డీల్‌ లో ఇరుక్కున్న విషయం తెలిసిందే.  అప్పటి నుంచి గాలి పరారీలో ఉన్నాడు. కాగా ఆయన కోసం సీసీబీ బృందాలు కర్ణాటక, హైదరాబాద్‌లో గాలింపు చర్యలు చేపడుతున్నాయి.

ఇదిలా ఉండగా...గాలి ఈ రోజు సీసీబీ ఎదుట లొంగిపోనున్నట్లు తెలుస్తోంది. ఇలా లొంగిపోవడానికి ప్రయత్నిస్తూనే.. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో శుక్రవారం పిటిషన్‌ దాఖలు చేయించారు. తన అనుచరుడు, ఎమ్మెల్యే శ్రీరాములతో ఈ మేరకు గాలి చర్చలు జరిపినట్లు సమాచారం.  తనకు కేసుల నుంచి పూర్తిగా విముక్తి కల్పించాలని, విచారణాధికారులను మార్పు చేయాలని కోరుతూ గాలి జనార్దనరెడ్డి రెండు వేర్వేరు పిటిషన్‌లను హైకోర్టులో దాఖలు చేయించారు.
 
సీసీబీ డీసీపీ గిరీశ్‌, ఏసీపీ వెంకట ప్రసన్నను మార్పు చేయాలని ఒక పిటిషన్‌ వేశారు. కేసుకు సంబంధించి దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు లేనందున తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని మరో పిటిషన్‌లో కోరారు. రాజకీయ ఉద్దేశాలతోనే వివాదంలో ఇరికించారని అందులో పేర్కొన్నారు.

కాగా, అంబిడెంట్‌ డీల్‌లో సీసీబీ పోలీసులు పక్కా సమాచారంతో వారం క్రితమే గాలి జనార్దనరెడ్డిని అరెస్టు చేయాలని భావించినా, ఉప ఎన్నికల నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేస్తే ప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పోలీసు ఉన్నతాధికారులకు సీఎం సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఫలితాలు ప్రకటించిన రోజునే సీసీబీ రంగంలోకి దిగింది. అయితే అప్పటికే పక్కా సమాచారంతో గాలి పరారయ్యారు.

more news

పరారీలో గాలి జనార్దన్ రెడ్డి: బయటపడిన షాకింగ్ విషయాలు

పోలీసు వేట: గాలి జనార్దన్ రెడ్డి హైదరాబాదులో ఉన్నారా...

అంబిడెంట్ కంపెనీతో డీల్: పరారీలో గాలి జనార్ధన్ రెడ్డి

పరారీలో గాలి జనార్థన్ రెడ్డి...ఎమ్మెల్యే శ్రీరాములు ఏమన్నారంటే