బెంగుళూరు: మాజీ మంత్రి, బీజేపీ నేత గాలి జనార్ధన్ రెడ్డి పరారీలో ఉన్నారు. గాలి జనార్ధన్‌ రెడ్డిని పట్టుకొనేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

అంబిడెంట్ అనే కంపెనీని ఈడీ నుండి కాపాడేందుకు  గాలి జనార్ధన్ రెడ్డి డీల్ కుదుర్చుకొన్నడానికి పోలీసులు చెబుతున్నారు. ఈడీ అధికారికి గాలి జనార్ధన్ రెడ్డి కోటి రూపాయాలను లంచంగా ఇచ్చారని పోలీసులు చెబుతున్నారు.

ఈ డీల్ లో గాలి జనార్ధన్ రెడ్డికి అంబిడెంట్ కంపెనీ 57 కిలోల బంగారు కడ్డీలను ఇచ్చారని సమాచారం. బళ్లారిలో ఈ బంగారం, నిధులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఈ విషయమై తెలుగు న్యూస్ ఛానెళ్లలో కథనాలు ప్రసారమయ్యాయి.

హైద్రాబాద్, బెంగుళూరు, ఢిల్లీలోని జనార్థన్ రెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. గాలి జనార్ధన్ రెడ్డి మిత్రుల ఇళ్లలో కూడ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ ఏడాది మార్చిలో ఈ డీల్ జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ విషయమై గాలి జనార్ధన్ రెడ్డిని ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తే ఆయన అందుబాటులో  లేకుండా పోయినట్టుగా పోలీసులు గుర్తించారు.