హైదరాబాద్: మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కోసం వేట సాగిస్తున్న బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి) పోలీసులు గురువారం హైదరాబాదులో గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాదులో గాలి జనార్దన్ రెడ్డి తల దాచుకున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు గురువారం ఇక్కడికి వచ్చారు. 

బంజారాహిల్స్ సమీపంలోని ఓ మిత్రుడి ఇంట్లో గాలి జనార్దన్ రెడ్డి తల దాచుకున్నట్లు వారికి గురువారం సాయంత్రం సమాచారం అందిందని, దాంతో వారు ఆ ఇంటికి వెళ్లారని, అయితే వారు వెళ్లడానికి కొద్ది సమయానికి ముందే గాలి జనార్దన్ రెడ్డి అక్కడి నుంచి పారిపోయాడని దర్యాప్తు అధికారులు చెప్పినట్లు ఓ జాతీయ మీడియా సంస్థ రాసింది. 

ఆ జాతీయ మీడియా వార్తాకథనం ప్రకారం.... మరో పోలీసు బృందం హైదరాబాదు వస్తుందని సిసిబీ సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. గాలి జనార్దన్ రెడ్డి హైదరాబాదులో ఉండి ఉంటారని భావిస్తున్నారు. ఆయన తన మూడు మొబైల్ ఫోన్లను కూడా స్విచాఫ్ చేశారు. 

కర్ణాటక సరిహద్దుల నుంచి గాలి జనార్దన్ రెడ్డి హైదరాబాదుకు, ఇతర ప్రాంతాలకు పలు మొబైల్ కాల్స్ చేసినట్లు గుర్తించారు. గాలి జనార్దన్ రెడ్డిని పట్టుకోవడానికి సాయపడాల్సిందిగా తాము ఇతర రాష్ట్రాల పోలీసులను కోరినట్లు కర్ణాటక అధికారులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

ఇంట్లో సోదాలు: అధికారులతో గొడవకు దిగిన గాలి అత్త

పరారీలో గాలి జనార్దన్ రెడ్డి: బయటపడిన షాకింగ్ విషయాలు

పోలీసు వేట: గాలి జనార్దన్ రెడ్డి హైదరాబాదులో ఉన్నారా...

అంబిడెంట్ కంపెనీతో డీల్: పరారీలో గాలి జనార్ధన్ రెడ్డి

పరారీలో గాలి జనార్థన్ రెడ్డి...ఎమ్మెల్యే శ్రీరాములు ఏమన్నారంటే