సంచనం రేపిన పోంజి కుంభకోణంలో బీజేపీ నేత, మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి నిన్న సాయంత్రం ఆయన్ను ప్రశ్నిస్తున్న బెంగళూరు సీసీబీ పోలీసులు అంబిడెంట్ ముడుపుల కేసులో గాలిని అదుపులోకి తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. అరెస్ట్ అనంతరం ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. సాయంత్రం గాలిని కోర్టులో హాజరుపరచనున్నారు.