Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ 14 ఏళ్ల నిరీక్షణ... ‘‘గాలి’’ కోటలో హస్తం పాగా

కర్ణాటకతో పాటు దేశ రాజకీయాల్లో బళ్లారికి తిరుగులేని ప్రాధాన్యత ఉంది. బీజేపీ నేత, మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి బళ్లారిని కేంద్రంగా చేసుకుని రాజకీయాలను శాసించారు. ఒక దశలో బళ్లారి అంటే గాలి.. గాలి అంటే బళ్లారి అన్నంతగా ఫేమస్ అయ్యారు. 

karnataka bypoll results: congress wins bellary
Author
Bellary, First Published Nov 6, 2018, 1:07 PM IST

కర్ణాటకతో పాటు దేశ రాజకీయాల్లో బళ్లారికి తిరుగులేని ప్రాధాన్యత ఉంది. బీజేపీ నేత, మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి బళ్లారిని కేంద్రంగా చేసుకుని రాజకీయాలను శాసించారు. ఒక దశలో బళ్లారి అంటే గాలి.. గాలి అంటే బళ్లారి అన్నంతగా ఫేమస్ అయ్యారు. 

ఆయన అనుచరులు, అభిమానులు ఇతర బలగంతో ఇక్కడ బీజేపీకి ఎదురులేకుండా చేశారు. వీరిని కాదని మరోకరు ఇక్కడ గెలవరంటే గాలి స్టామినా ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అక్రమ మైనింగ్ కేసుల్లో జైలుకు వెళ్లినా.. తెర వెనుక నుంచి కథ మొత్తం నడిపించారు గాలి జనార్థన్ రెడ్డి. ఈ ఏడాది మే నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్ల సైతం గాలి హవా స్పష్టంగా కనిపించింది. 

బళ్లారితో పాటు సమీప జిల్లాల్లో మొత్తం 10 మందిని గెలిపించుకోవడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడం వెనుక గాలి కీలకపాత్ర పోషించారు. వీటన్నింటికి బళ్లారి నగరమే అడ్డా. 2004 నుంచి బీజేపీ అభ్యర్థులే ఇక్కడ గెలుస్తూ వచ్చారు... కాంగ్రెస్‌తో పాటు మిగిలిన పార్టీలు ఇక్కడ బీజేపీని ఓడించేందుకు పావులు కదిపినప్పటికీ ... గాలి ముందు ఆటలు సాగలేదు. 

ఏళ్ల పాటు ఇక్కడ గాలి సోదరులు, ఆయన ప్రధాన అనుచరుడు బి. శ్రీరాములే గెలుస్తూ వచ్చారు. అయితే 2014 లోక్‌సభ ఎన్నికల్లో బళ్లారి నుంచి ఎంపీగా గెలిచిన బి. శ్రీరాములు.. ఈ ఏడాది జరిగిన కర్ణాటక ఎన్నికల్లో గెలుపొందడంతో తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో.. ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. 

ఉప ఎన్నికల్లోనూ వ్యూహాత్మకంగా పావులు కదిపిన గాలి జనార్థన్ రెడ్డి.. శ్రీరాములు సోదరి శాంతను బరిలోకి దించారు. అయితే ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్-జేడీఎస్ కూటమి మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడైన ఉగ్రప్పను కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దింపింది. ఈ ఎత్తుగడ ఫలించి తొలి రౌండ్ నుంచే ఉగ్రప్ప భారీ ఆధిక్యంతో గెలిచారు. 

అయితే ఇది గాలి జనార్థన్ రెడ్డి స్వయంకృత అపరాధమే అంటున్నారు విశ్లేషకులు. ‘‘ నా నుంచి నా పిల్లల్ని దూరం చేశారు.. అందువల్లే దేవుడు మాజీ సీఎం సిద్ధరామయ్య కొడుకు అనారోగ్యంతో చనిపోయేలా చేశాడంటూ గాలి చేసిన వ్యాఖ్యలు కన్నడ రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నుంచే కాకుండా బీజేపీ నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. 

కర్ణాటక బీజేపీ చీఫ్ యడ్యూరప్ప స్వయంగా రంగంలోకి దిగి.. చేసిన వ్యాఖ్యలకు గానూ.. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలపై ప్రజల్లో జరిగిన చర్చ కూడా ఎన్నికల్లో బీజేపీ ఓటమిపై ప్రభావం చూపిందని విశ్లేషకులు అంటున్నారు. ఈ పరిణామాలన్ని కలిసి.. సుమారు రెండు దశాబ్ధాలుగా బళ్లారిని ఏలుతూ వస్తున్న గాలి కోటను కూల్చాయని బెంగళూరు టాక్. 

Follow Us:
Download App:
  • android
  • ios