Asianet News TeluguAsianet News Telugu

పోలీసు వేట: గాలి జనార్దన్ రెడ్డి హైదరాబాదులో ఉన్నారా...

ఈడీ నుంచి అంబిడెంట్ కంపెనీని తప్పించేందుకు జనార్ధన్‌రెడ్డి ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. అంబిడెంట్ కంపెనీ నుంచి ఆయన 57 కిలోల బంగారం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. 

Gali Janardhan Reddy where abouts searched
Author
Bengaluru, First Published Nov 8, 2018, 10:26 AM IST

బెంగళూరు: పరారీలో ఉన్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి హైదరాబాదులో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన కోసం పోలీసులు గాలింపు చేపట్టిన విషయం తెలిసిందే. ఆయన కోసం పోలీసులు లుకవుట్ నోటీసులు కూడా జారీ చేశారు.

గాలి జనార్దన్ రెడ్డి అనుచరుల ముబైల్ సిగ్నళ్ల ఆధారంగా జనార్ధన్‌రెడ్డి హైదరాబాద్‌లో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో గాలి జనార్ధన్‌రెడ్డి కేసు గురించిన వివరాలు బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ సునీల్ కుమార్ వివరించారు. 

ఆయన చెప్పిన వివరాల ప్రకారం.... 2014లో బెంగళూరులో అంబిడెంట్ మార్కెటింగ్ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించింది. ఆ కంపెనీ ప్రజల నుంచి భారీ ఎత్తున డిపాజిట్లు సేకరించింది. డిపాజిట్లపై 30-40శాతం వడ్డీ ఇస్తామని డిపాజిట్ దారులకు కంపెనీ హామీ ఇచ్చింది. కంపెనీ హామీ నిలబెట్టుకోకపోవడంతో ఖాతాదారులు ఆందోళన చేశారు. 

ఖాతాదారుల ఫిర్యాదు మేరకు 2017లో కంపెనీలో ఈడీ తనిఖీలు నిర్వహించి కేసు నమోదు చేసింది. కేసు నుంచి తప్పించుకునేందుకు నిర్వహకులు కొద్ది మందిని ఆశ్రయించినట్లు పోలీసులు గుర్తించారు. కంపెనీ ఆశ్రయించిన వారిలో గాలి జనార్ధన్‌రెడ్డి కూడా ఉన్నట్లు సమాచారం.

ఈడీ నుంచి అంబిడెంట్ కంపెనీని తప్పించేందుకు జనార్ధన్‌రెడ్డి ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. అంబిడెంట్ కంపెనీ నుంచి ఆయన 57 కిలోల బంగారం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారికి రూ.కోటి లంచం ఇచ్చినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.

సంబంధిత వార్త

అంబిడెంట్ కంపెనీతో డీల్: పరారీలో గాలి జనార్ధన్ రెడ్డి

Follow Us:
Download App:
  • android
  • ios