న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరంపై ఇండియన్ ఎయిర్‌పోర్స్ సర్జికల్ స్ట్రైక్స్‌  సమయంలో అత్యంత పకడ్బందీగా వ్యవహరించింది. పాక్‌కు చెందిన వైమానిక దళాన్ని ఏమార్చేందుకు ఇండియన్ ఎయిర్‌పోర్స్ డెకాయ్ ఆపరేషన్ నిర్వహించింది.

గత నెల 26వ తేదీ తెల్లవారుజామున పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో జైషే మహ్మద్ తీవ్రవాద శిబిరాలపై ఇండియా సర్జికల్ స్ట్రైక్స్‌కు పాల్పడింది. ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యేందుకు గాను  ఇండియా డికాయ్ ప్యాకేజీని ఏర్పాటు చేసింది.

పాక్‌ యుద్ధ విమానాలను ఏమార్చేందుకు ఉత్తుత్తి దాడి బృందాన్ని ఇండియా ప్రయోగించింది. మిరాజ్-2000, సుఖోయ్- ఎంకేఐ, యుద్ధవిమానాలకు గాల్లోనే  ఇంధనం నింపే ట్యాంకర్ విమానం, గగనతల ముందస్తు హెచ్చరికల విమానాలను భారత్ వాడింది.

సర్జికల్ స్ట్రైక్స్‌ చేసిన యుద్ధ విమానాలు పాక్ సరిహద్దు వెంట ఉన్న విమానాశ్రయాల నుండి కాకుండా దూరంగా ఉన్న గ్వాలియర్, ఆగ్రా, బరేలీ నుండి బయలు దేరాయి. పాక్ గగనతలంలో గస్తీ తిరుగుతున్న యుద్ధ విమానాలను ఆకర్షించేందుకు గాను డికాయ్ (ఉత్తుత్తి దాడి చేసే బృందం)  విమానాలు పంజాబ్‌లోని వైమానిక స్థావరం నుండి టేకాఫ్ అయ్యాయి.

ఈ విమానాలు జైషే ప్రధాన స్థావరం ఉన్న బహావల్‌పూర్ దిశగా వెళ్లాయి.  పాక్ విమానాలు అటు వైపు కదిలాయి. దీంతో భారత ఎయిర్‌పోర్స్ విభాగం అసలు ఆపరేషన్‌ను ప్రారంభించింది. బాలాకోట్‌లోని జైషే శిబిరాలపై దాడికి పాల్పడింది.

సంబంధిత వార్తలు

శవాలను లెక్కించడం మా పని కాదు: ఎయిర్ చీఫ్ మార్షల్

ఆలస్యం చేసి ఉంటే అభినందన్ బతికి ఉండేవాడు కాదు...

అభినందన్ వెన్నెముకకు గాయం, ఎలాంటి బగ్స్ లేవు

అభినందన్ అప్పగింత: ఆ మహిళ ఎవరో తెలుసా...

అభినందన్‌ను పాక్ ఎలా అప్పగించిందంటే..

భారత్‌ చేరిన వీర సైనికుడు అభినందన్

వాఘా సరిహద్దుకు చేరుకొన్న అభినందన్: సంబరాలు

అభినందన్ కోసం విమానం పంపుతామంటే వద్దన్న పాక్

అభినందన్‌ను ప్రశ్నించనున్న 'రా' అధికారులు

వాఘా సరిహద్దుకు చేరుకొన్న అభినందన్: సంబరాలు

అభినందన్ కోసం విమానం పంపుతామంటే వద్దన్న పాక్

అభినందన్: వాఘా వద్ద భారీ బందోబస్తు, రిట్రీట్ రద్దు

కొన్ని గంటల్లోనే భారత్‌కు అభినందన్‌: రాజ్‌నాధ్ సింగ్

లాహోర్‌కు చేరుకున్న అభినందన్, మరికొద్దిసేపట్లో వాఘాకు

వాఘా వద్ద అభినందన్‌ను రిసీవ్ చేసుకోనున్న ప్రత్యేక బృందం

అభినందన్‌కు అప్పగింతకు ముందు, ఆ తర్వాత ఇలా...

మొక్కవోని అభినందన్ ధైర్యం: పేపర్లు నమిలి మింగేశాడు

వాఘాకు చేరుకొన్న అభినందన్ తల్లిదండ్రులు: కొడుకు కోసం ఎదురు చూపులు

మసూద్‌ మా దేశంలోనే ఉన్నాడు: అంగీకరించిన పాక్