Asianet News TeluguAsianet News Telugu

ఆలస్యం చేసి ఉంటే అభినందన్ బతికి ఉండేవాడు కాదు....

భారత ఎయిర్ వింగ్  కమాండర్  అభినందన్  మిగ్ విమానం నుండి ప్యారాచూట్ సహాయంతో సురక్షితంగా ఎలా బయటపడడం పట్ల  పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు

Even fittest fighter pilots black out during ejection, says retired IAF officer
Author
New Delhi, First Published Mar 4, 2019, 11:12 AM IST


న్యూఢిల్లీ: భారత ఎయిర్ వింగ్  కమాండర్  అభినందన్  మిగ్ విమానం నుండి ప్యారాచూట్ సహాయంతో సురక్షితంగా ఎలా బయటపడడం పట్ల  పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే యుద్ధ విమానం కూలిపోయే సమయంలో ప్యారాచూట్‌ సహాయంతో సురక్షితంగా తప్పించుకోవడం ఆషామాషీ విషయం కాదని  నిపుణులు చెబుతున్నారు. ఎజెక్ట్ కావడానికి ఆలస్యంగా నిర్నయం తీసుకొంటే  ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

గత నెల  27వ తేదీన పాక్‌కు చెందిన ఎఫ్-16  విమానాన్ని వెంటాడుతూ వెళ్లిన అభినందన్  మిగ్ -21 కుప్పకూలింది,  ఈ విమానం కుప్పకూలిపోతున్న విషయాన్ని గమనించిన అభినందన్ చివరి నిమిషంలో  విమానం నుండి ఎజెక్ట్ అయ్యాడు. 

విమానం నుండి ఎజెక్ట్ అయ్యే సమయంలో  పైలట్ శరీరం కొన్ని సెకన్ల పాటు  పలు దిక్కులకు లాగినట్టుగా ఉంటుంది. ఈ సమయంలో ఎంత ఫిట్‌గా ఉన్న .పైలట్లైన సరే రెండు మూడు సెకన్ పాటు ఇబ్బందికి గురౌతారు. ఈ సమయంలో పైలట్ శరీరంపై విపరీతంగా దెబ్బలు తిన్నట్టుగా ఉంటుందని రిటైర్డ్ పైలట్ అనిల్ చోప్రా చెప్పారు.

ఏడేళ్ల  క్రితం తొలిసారిగా చోప్రా యుద్ధ విమానం నుండి తొలిసారిగా ఎజెక్టు అయ్యాడు.  ఈ ఏడాది జూన్ మాసానికి అభినందన్ వర్థమాన్‌కు 35 ఏళ్లు నిండుతాయి. శుక్రవారంనాడు ఆయన పాక్ నుండి సురక్షితంగా ఇండియాకు చేరుకొన్నాడు. 

మిగ్-21 యుద్ధ విమానంలో ఎజెక్ట్ బటన్ నొక్కగానే ప్యారాచ్యూట్ ఓపెన్ కావడానికి కనీసం మూడు సెకన్లు పట్టే అవకాశం ఉందని అనిల్ చెబుతున్నారు. యుద్ధ విమానం నుండి బయటకు వచ్చే సమయంలో పెద్ద ఎత్తున శబ్దాలు వెలువడుతాయని అనిల్ చెప్పారు. పైలట్ చెవుల వద్దే టపాకాయలు కాలుస్తున్నట్టుగా శబ్దాలు ఉంటాయని ఆయన గుర్తు చేశారు.

2012 ఫిబ్రవరి మాసంలో అనిల్ చోప్రా, రామ్‌కుమార్‌లు  మిరాజ్ 2000 విమానం నుండి ఎజెక్ట్ అయ్యారు. పాక్ యుద్ధ విమానంపై దాడి చేసిన సమయంలో అభినందన్ ఉపయోగించిన మిగ్  నుండి సురక్షితంగా బయటపడడం అంటే  మళ్లీ  పునర్జన్మ ఎత్తడమేనని ఆయన అనిల్ అభిప్రాయపడ్డారు. 

యుద్ధ విమానాల్లో పైలట్లుగా పనిచేస్తున్న వారు ఎజెక్టు కావడానికి  అలస్యంగా నిర్ణయం తీసుకోవడంలో ప్రాణాలు కోల్పోయారని అనిల్ చోప్రా చెప్పారు.  ఎజెక్ట్ బటన్ నొక్కిన సమయంలో పైలట్ సీటు నుండి వేరు చేయబడతాడని ఆయన వివరించారు. ప్యారాచ్యూట్ ఓపెన్ అయిన తర్వాత అంతా బాగానే ఉంటుందన్నారు.

 

సంబంధిత వార్తలు

అభినందన్ వెన్నెముకకు గాయం, ఎలాంటి బగ్స్ లేవు

అభినందన్ అప్పగింత: ఆ మహిళ ఎవరో తెలుసా...

అభినందన్‌ను పాక్ ఎలా అప్పగించిందంటే..

భారత్‌ చేరిన వీర సైనికుడు అభినందన్

వాఘా సరిహద్దుకు చేరుకొన్న అభినందన్: సంబరాలు

అభినందన్ కోసం విమానం పంపుతామంటే వద్దన్న పాక్

అభినందన్‌ను ప్రశ్నించనున్న 'రా' అధికారులు

వాఘా సరిహద్దుకు చేరుకొన్న అభినందన్: సంబరాలు

అభినందన్ కోసం విమానం పంపుతామంటే వద్దన్న పాక్

అభినందన్: వాఘా వద్ద భారీ బందోబస్తు, రిట్రీట్ రద్దు

కొన్ని గంటల్లోనే భారత్‌కు అభినందన్‌: రాజ్‌నాధ్ సింగ్

లాహోర్‌కు చేరుకున్న అభినందన్, మరికొద్దిసేపట్లో వాఘాకు

వాఘా వద్ద అభినందన్‌ను రిసీవ్ చేసుకోనున్న ప్రత్యేక బృందం

అభినందన్‌కు అప్పగింతకు ముందు, ఆ తర్వాత ఇలా...

మొక్కవోని అభినందన్ ధైర్యం: పేపర్లు నమిలి మింగేశాడు

వాఘాకు చేరుకొన్న అభినందన్ తల్లిదండ్రులు: కొడుకు కోసం ఎదురు చూపులు

మసూద్‌ మా దేశంలోనే ఉన్నాడు: అంగీకరించిన పాక్

Follow Us:
Download App:
  • android
  • ios