అభినందన్ అప్పగింతకు ముందు, ఆ తర్వాత ఇలా...
పాక్ చెరలో ఉన్న అభినందన్‌ను శుక్రవారం నాడు వాఘా వద్ద ఇండియన్ ఆర్మీకి పాక్ అప్పగించనుంది
న్యూఢిల్లీ: పాక్ చెరలో ఉన్న అభినందన్‌ను శుక్రవారం నాడు వాఘా వద్ద ఇండియన్ ఆర్మీకి పాక్ అప్పగించనుంది. ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల తర్వాత అభినందన్ వాఘా వద్దకు చేరుకొనే అవకాశం ఉంది. అభినందన్‌ను అప్పగించే ముందు కొన్ని లీగల్ కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
అభినందన్‌ను పాక్ ఆర్మీ విమానంలో లాహోర్‌కు తరలించారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత వాఘా బోర్డర్ వద్దకు అభినందన్‌ను పాక్ ఆర్మీ తీసుకొచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
వాఘా బోర్డర్ వద్దకు అభినందన్ చేరుకోగానే ఆయనకు భారత వైద్య బృందం వైద్య పరీక్షలు చేయనుంది. అభినందన్ శరీరంలో పాక్ ఆర్మీ ఏమైనా ప్రవేశపెట్టిందా అనే కోణంలో కూడ ఈ పరీక్షలు చేయనున్నారు.
మరో వైపు అభినందన్ ఆరోగ్య పరిస్థితిపై కూడ ఈ పరీక్షల్లో తేల్చనున్నారు. అదే సమయంలో పాక్ ఆర్మీ చేతికి చిక్కిన సమయంలో తాను ఏం చేశాడనే విషయమై అభినందన్ నుండి కూడ భారత రక్షణ శాఖాధికారులు స్టేట్‌మెంట్ తీసుకొంటారు. ఈ స్టేట్‌మెంట్ తర్వాత అభినందన్ కుటుంబసభ్యులతో అతడిని మాట్లాడించే అవకాశం ఉంది.
ప్రస్తుతం అభినందన్ తల్లిదండ్రులు వాఘా సరిహద్దుకు చేరుకొన్నారు. వాఘా సరిహద్దు వద్ద అభినందన్ కుటుంబసభ్యులను మీడియా కంటపడకుండా ఆర్మీ చర్యలు తీసుకొంటుంది.
సంబంధిత వార్తలు
మొక్కవోని అభినందన్ ధైర్యం: పేపర్లు నమిలి మింగేశాడు
వాఘాకు చేరుకొన్న అభినందన్ తల్లిదండ్రులు: కొడుకు కోసం ఎదురు చూపులు
మసూద్ మా దేశంలోనే ఉన్నాడు: అంగీకరించిన పాక్