వాఘాకు చేరుకొన్న అభినందన్ తల్లిదండ్రులు: కొడుకు కోసం ఎదురు చూపులు

పాక్ ఆర్మీ చెరలో బందీగా ఉన్న వింగ్ కమాండర్  అభినందన్‌ మరికొద్ది గంటల్లో భారత్‌కు చేరుకోనున్నారు. అభినందన్‌ను భారత్ వైమానిక దళం రిసీవ్ చేసుకోనుంది.

Wing Commander Abhinandan Varthaman's Parents Get Standing Ovation On Flight to Delhi

న్యూఢిల్లీ: పాక్ ఆర్మీ చెరలో బందీగా ఉన్న వింగ్ కమాండర్  అభినందన్‌ మరికొద్ది గంటల్లో భారత్‌కు చేరుకోనున్నారు. అభినందన్‌ను భారత్ వైమానిక దళం రిసీవ్ చేసుకోనుంది. అభినందన్ కోసం కుటుంబసభ్యులు  ఇప్పటికే వాఘా సరిహద్దుకు చేరుకొన్నారు.

అభినందన్  తండ్రి సింహకుట్టి ఎయిర్ మార్షల్‌గా పనిచేసి రిటైరయ్యారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన అభినందన్ తాంబరం ఐఎఎఫ్‌లో వింగ్ కమాండర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల పాక్ యుద్ధ విమానాలు భారత్‌ గగనతలంలోకి ప్రవేశించిన విషయాన్ని గమనించిన అభినందన్  మిగ్ విమానంతో  పాక్ విమానాన్ని వెంటాడాడు.  ఈ క్రమంలో పాక్ విమానం తోకముడిచింది.

ఈ క్రమంలోనే భారత్ మిగ్ కుప్పకూలింది. ఈ విమానం నుండి  అభినందన్ ప్యారాచూట్ నుండి సురక్షితంగా తప్పించుకొన్నారు. అయితే అభినందన్ పాక్ భూభాగంలో దిగాడు.పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురువారం నాడు  పాక్ పార్లమెంట్‌లో ప్రసంగిస్తూ అభినందన్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు.

 

 

ఈ క్రమంలోనే  అభినందన్‌ను రిసీవ్ చేసుకొనేందుకుగాను   అభినందన్ తల్లిదండ్రులు కూడ వాఘా సరిహద్దుకు చేరుకొన్నారు. అభినందన్‌ను చూసేందుకు వందలాది మంది వాఘా సరిహద్దుకు చేరుకొన్నారు.  అభినందన్ కుటుంబసభ్యులు కూడ ఆయన కోసం ఎదురు చూస్తున్నారు.

అభినందన్ కోసం ఆ కుటుంబం ఎదురుచూస్తోంది. తమ కొడుకు క్షేమంగా ఉండాలని దేశం మొత్తం ప్రార్థనలు చేయడం పట్ల ఆ కుటుంబం ప్రతి ఒక్కరికీ కూడ ధన్యవాదాలు తెలుపుతోంది.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios