అభినందన్ కోసం విమానం పంపుతామంటే వద్దన్న పాక్
పాక్ ఆర్మీ చేతిలో బందీగా ఉన్న ఇండియన్ వింగ్ కమాండర్ అభినందన్‌ను భారత్‌కు రప్పించేందుకు ప్రత్యేక విమానాన్ని పంపుతామని పాకిస్తాన్‌కు భారత్ ప్రతిపాదించింది.
న్యూఢిల్లీ: పాక్ ఆర్మీ చేతిలో బందీగా ఉన్న ఇండియన్ వింగ్ కమాండర్ అభినందన్‌ను భారత్‌కు రప్పించేందుకు ప్రత్యేక విమానాన్ని పంపుతామని పాకిస్తాన్‌కు భారత్ ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనను పాక్ తోసిపుచ్చింది.తామే అభినందన్ ను తీసుకొచ్చి అప్పగిస్తామని పాక్ అధికారులు భారత్‌కు వివరించారు.
బుధవారం నాడు పాక్ భూభాగంలో అడుగుపెట్టిన అభినందన్‌ను పాక్ ఆర్మీ తమ అదుపులోకి తీసుకొంది. పాక్ నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా దిల్లీకి తీసుకొచ్చి ఆయనకు వెంటనే వైద్య చికిత్స అందించాలని భారత్ భావించింది.
రోడ్డు మార్గం ద్వారా వాఘా సరిహద్దు వద్ద అభినందన్‌ను అప్పగిస్తామని తెలిపింది.కానీ, పాక్ ఒప్పుకోకపోవడంతో వాఘా సరిహద్దు వద్దే అభినందన్‌ను ఇండియా ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక బృందం రిసీవ్ చేసుకొంటుంది. పాక్‌లోని భారత్ హైకమిషన్ కార్యాలయం ఇప్పటికే అభినందన్ అప్పగింతకు సంబంధించిన పత్రాలను పూర్తి చేసి వారికి అప్పగించారు.
సంబంధిత వార్తలు
అభినందన్: వాఘా వద్ద భారీ బందోబస్తు, రిట్రీట్ రద్దు
కొన్ని గంటల్లోనే భారత్‌కు అభినందన్: రాజ్‌నాధ్ సింగ్
లాహోర్‌కు చేరుకున్న అభినందన్, మరికొద్దిసేపట్లో వాఘాకు
వాఘా వద్ద అభినందన్‌ను రిసీవ్ చేసుకోనున్న ప్రత్యేక బృందం
అభినందన్‌కు అప్పగింతకు ముందు, ఆ తర్వాత ఇలా...
మొక్కవోని అభినందన్ ధైర్యం: పేపర్లు నమిలి మింగేశాడు
వాఘాకు చేరుకొన్న అభినందన్ తల్లిదండ్రులు: కొడుకు కోసం ఎదురు చూపులు
మసూద్ మా దేశంలోనే ఉన్నాడు: అంగీకరించిన పాక్