అభినందన్‌ను ప్రశ్నించనున్న 'రా' అధికారులు

యావత్తు భారత్‌కు హీరోగా నిలిచిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్‌ను ఇండియన్ మిలటరీ ఇంటలిజెన్స్ బ్యూరో  రీసెర్స్ అండ్ ఎనాలిసిసిస్ వింగ్ (రా) అధికారులు ప్రశ్నించనున్నారు.

Bug Scan, Debriefing and Psych Test: What IAF Wing Commander Abhinandan Will Go Through on Return

న్యూఢిల్లీ: యావత్తు భారత్‌కు హీరోగా నిలిచిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్‌ను ఇండియన్ మిలటరీ ఇంటలిజెన్స్ బ్యూరో  రీసెర్స్ అండ్ ఎనాలిసిసిస్ వింగ్ (రా) అధికారులు ప్రశ్నించనున్నారు.

శుక్రవారం నాడు అభినందన్‌ను పాక్ అధికారులు వాఘా బోర్డర్ వద్ద అప్పగించనున్నారు. వాఘా బోర్డర్ వద్ద న్యాయ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత కుటుంబసభ్యులతో కొద్దిసేపు అభినందన్‌ను మాట్లాడించనున్నారు.

ఆ తర్వాత అభినందన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.  ఈ వైద్య పరీక్షల్లో పలు రకాల టెస్టులు చేయనున్నారు. ఫిజికల్ టెస్ట్‌తో పాటు, అభినందన్ శరీరంలో ఏమైనా ఎలక్ట్రానిక్ వస్తువులను అతనికి తెలియకుండా పాక్ అమర్చిందా అనే విషయమై కూడ  ఈ టెస్టుల ద్వారా తేల్చనున్నారు. 

ఇండియాకు అభినందన్ చేరుకోగానే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన  ఇంటలిజెన్స్ యూనిట్ అతడిని తమ అదుపులోకి తీసుకొంటారు. ఆ తర్వాత మెడికల్ టెస్టులు నిర్వహిస్తారు. 

ఆ తర్వాత ఐబీ, రా అధికారులు అభినందన్‌ను  ప్రశ్నించనున్నారు. సాధారణంగా అయితే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఐబీ, రా అధికారులకు తమ సిబ్బందిని ప్రశ్నించేందుకు అవకాశం ఇవ్వరు. కానీ, ఈ కేసు ప్రత్యేకమైందిగా భావిస్తున్నందున  అభినందన్‌ను  ప్రశ్నించనున్నారు.

ఇదిలా ఉంటే  మెడికల్, ఫిజికల్ ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంటుంది. మరో వైపు అత్యంత శక్తివంతమైన ఎప్-16 విమానాన్ని అభినందన్ మిగ్ విమానం ద్వారా కూల్చివేయడాన్ని ఓ ఆర్మీ అధికారి ప్రశంసిస్తున్నాడు. 

1970లో రష్యా  మిగ్ యుద్ధ విమానం  తయారు చేసింది. ఎప్-16 యుద్ధ విమానం అమెరికా తయారు చేసింది.  అమెరికా తయారు చేసిన అత్యంత అత్యాధునికమైన యుద్ధ విమానాన్ని మిగ్ యుద్ధ విమానం కూల్చివేయడాన్ని ఓ ఆర్మీ అధికారి అభినందన్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు.

సంబంధిత వార్తలు

వాఘా సరిహద్దుకు చేరుకొన్న అభినందన్: సంబరాలు

అభినందన్ కోసం విమానం పంపుతామంటే వద్దన్న పాక్

అభినందన్: వాఘా వద్ద భారీ బందోబస్తు, రిట్రీట్ రద్దు

కొన్ని గంటల్లోనే భారత్‌కు అభినందన్‌: రాజ్‌నాధ్ సింగ్

లాహోర్‌కు చేరుకున్న అభినందన్, మరికొద్దిసేపట్లో వాఘాకు

వాఘా వద్ద అభినందన్‌ను రిసీవ్ చేసుకోనున్న ప్రత్యేక బృందం

అభినందన్‌కు అప్పగింతకు ముందు, ఆ తర్వాత ఇలా...

మొక్కవోని అభినందన్ ధైర్యం: పేపర్లు నమిలి మింగేశాడు

వాఘాకు చేరుకొన్న అభినందన్ తల్లిదండ్రులు: కొడుకు కోసం ఎదురు చూపులు

మసూద్‌ మా దేశంలోనే ఉన్నాడు: అంగీకరించిన పాక్

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios