న్యూఢిల్లీ: బాలాకోట్‌లోని జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలను తాము ధ్వసం చేసినట్టుగా ఇండియన్ ఎయిర్ మార్షల్  బిఎస్ ధనోనా చెప్పారు. అయితే ఈ ఘటనలో ఎంతమంది  ఉగ్రవాదులు చనిపోయారని తాము లెక్కించలేదన్నారు.దాడులు చేయడమే తమ పని ఆయన స్పష్టం చేశారు.

సోమవారం నాడు న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాద శిబిరాల్లో ఎంతమంది ఉన్నారనే విషయం కూడ మృతుల సంఖ్యపై ఆధారపడి ఉంటుందని ఆయన వివరించారు. 

ఇదిలా ఉంటే ప్రభుత్వం మాత్రం సర్జికల్ స్ట్రైక్స్ విజయవంతమైనట్టుగా ప్రకటించింది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మాత్రం ఆదివారం నాడు 250 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్టుగా ప్రకటించారు. మరోవైపు 300 మంది మృతి చెందినట్టుగా కూడ ప్రచారం సాగుతోంది. కానీ, ఈ విషయమై స్పష్టమైన సంఖ్య ఇవ్వలేదు.

ఈ ఘటనలో ఎంతమంది చనిపోయారనేది ప్రభుత్వం ప్రకటించనుందని  ఎయిర్ మార్షల్ ప్రకటించారు.తమ దాడిలో ఎంతమంది చనిపోయామనేది చూడమన్నారు.తమ లక్ష్యాన్ని చేధించామా లేదా అనేది చూస్తామని ధనోనా చెప్పారు.

 

 

తాము లక్ష్యాన్ని చేధించినట్టుగా భారత విదేశాంగ కార్యదర్శి ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  తాము లక్ష్యాన్ని చేధించినందునే పాక్ రెస్పాండ్ అయిందన్నారు. అడవి ప్రాంతంలో తాము బాంబులను జారవిడిస్తే పాక్ ఎందుకు రెస్పాండ్ అవుతోందని ఆయన ప్రశ్నించారు.

గత నెల 27వ తేదీన ఎల్ఓసీని ఇండియా, పాకిస్తాన్ దేశాలకు చెందిన విమానాలు దాటాయని ఆయన గుర్తు చేశారు.రాఫెల్ యుద్ధ విమానాలు సెప్టెంబర్ మాసంలో భారత ఆర్మీ విభాగంలోకి రానున్నాయని చెప్పారు. ఫ్రాన్స్‌ నుండి 36 రాఫెల్ యుద్ధ విమనాలు రానున్నట్టు చెప్పారు.

మెడికల్ పరీక్షల తర్వాతే అభినందన్  మళ్లీ యుద్ధ విమానాన్ని నడుపుతాడా లేదా అనేది నిర్ధారించనున్నట్టు ఆయన చెప్పారు.  ఒకవేళ అభినందన్‌కు చికిత్స అవసరమైతే ఇప్పిస్తామన్నారు.

సంబంధిత వార్తలు

ఆలస్యం చేసి ఉంటే అభినందన్ బతికి ఉండేవాడు కాదు...

అభినందన్ వెన్నెముకకు గాయం, ఎలాంటి బగ్స్ లేవు

అభినందన్ అప్పగింత: ఆ మహిళ ఎవరో తెలుసా...

అభినందన్‌ను పాక్ ఎలా అప్పగించిందంటే..

భారత్‌ చేరిన వీర సైనికుడు అభినందన్

వాఘా సరిహద్దుకు చేరుకొన్న అభినందన్: సంబరాలు

అభినందన్ కోసం విమానం పంపుతామంటే వద్దన్న పాక్

అభినందన్‌ను ప్రశ్నించనున్న 'రా' అధికారులు

వాఘా సరిహద్దుకు చేరుకొన్న అభినందన్: సంబరాలు

అభినందన్ కోసం విమానం పంపుతామంటే వద్దన్న పాక్

అభినందన్: వాఘా వద్ద భారీ బందోబస్తు, రిట్రీట్ రద్దు

కొన్ని గంటల్లోనే భారత్‌కు అభినందన్‌: రాజ్‌నాధ్ సింగ్

లాహోర్‌కు చేరుకున్న అభినందన్, మరికొద్దిసేపట్లో వాఘాకు

వాఘా వద్ద అభినందన్‌ను రిసీవ్ చేసుకోనున్న ప్రత్యేక బృందం

అభినందన్‌కు అప్పగింతకు ముందు, ఆ తర్వాత ఇలా...

మొక్కవోని అభినందన్ ధైర్యం: పేపర్లు నమిలి మింగేశాడు

వాఘాకు చేరుకొన్న అభినందన్ తల్లిదండ్రులు: కొడుకు కోసం ఎదురు చూపులు

మసూద్‌ మా దేశంలోనే ఉన్నాడు: అంగీకరించిన పాక్