కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ కావడంతో రాజకీయ విశ్లేషకులు మరో  కొత్త వాదన తెరపైకి తీసుకొస్తున్నారు. నాడు అధికారంతో అమిత్ షాను చిదంబరం అరెస్ట్ చేయించారని.. ఇప్పుడు అదే పవర్‌తో చిదంబరాన్ని షా అరెస్ట్ చేయించారని చెబుతున్నారు. 

యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు చిదంబరం ఓ వెలుగు వెలిగారు.. హోంమంత్రిగా, ఆర్ధికమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు సోనియా, మన్మోహన్ తర్వాత ఆయనే అన్నంతగా చక్రం తిప్పారు.

2008 నవంబర్ 29 నుంచి 2012 జూలై 31 వరకు చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నారు. గోద్రా అల్లర్లు, సహా పలు ఎన్‌కౌంటర్లకు బాధ్యుడిని చేస్తూ మోడీని ఇరికించే ప్రయత్నాన్ని చిదంబరం చేశారని అప్పట్లో బీజేపీ ఆరోపించింది.

కానీ అది కుదరకపోవడంతో మోడీకి కుడి భుజంగా ఉన్న నాటి గుజరాత్ హోంమంత్రి అమిత్  షాను చిదంబరం టార్గెట్ చేశారని అంటారు. అప్పట్లో సోహ్రాబుద్దీన్ షేక్, ఆయన భార్య కౌసర్ బీ, సహాయకుడు తులసీరాం ప్రజాపతిల ఎన్‌కౌంటర్‌లను చిదంబరం అస్త్రాలుగా మార్చుకున్నారు.

అది బూటకపు ఎన్‌కౌంటరని... అమిత్ షా అనుమతితోనే సోహ్రాబుద్దీన్‌ను పోలీసులు హతమార్చారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐ 2010లో అభియోగాలు మోపింది. 2010 జూలై 25న అమిత్ షాను ఈ కేసులో అరెస్ట్ చేశారు.

హత్య, బలవంతపు వసూళ్లు, కిడ్నాప్ అభియోగాలను మోపారు. స్వయంగా న్యాయవాది కావడంతో చిదంబరం ఛార్జిషీటును పరిశీలించి పలు మార్పులు చేశారని.. అప్పట్లో వార్తలు వచ్చాయి.

సోహ్రాబుద్దీన్ కేసులో అరెస్టయిన వెంటనే హోంమంత్రి పదవికి అమిత్ షా రాజీనామా చేయడంతో పాటు మూడు  నెలలు జైలులో ఉన్నారు. ఇప్పుడు చిదంబరానికి ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ కోరినట్లుగానే.. అప్పట్లో అమిత్ షాకు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ గుజరాత్ హైకోర్టును కోరింది.

అయితే మూడు నెలల తర్వాత అమిత్  షాకు బెయిల్ ఇచ్చింది... రెండేళ్ల పాటు గుజరాత్‌‌లో షా అడుగుపెట్టకుండా తీర్పు ఇచ్చారు. అమిత్ షా రాష్ట్రాన్ని విడిచి.. ఢిల్లీలోని గుజరాత్ భవన్‌లోని ఒక గదిలో రెండేళ్లపాటు ప్రవాస జీవితం గడపాల్సి వచ్చింది.

చివరికి కేసు విచారణను ముంబైకి బదిలీ చేస్తూ గుజరాత్‌లో షా కాలుమోపేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అరెస్ట్ సమయంలో ‘‘తాను పడి లేచిన కెరటంలా తిరిగొస్తానంటూ‘‘ వ్యాఖ్యానించారు.

అయితే హోంమంత్రి చిదంబరం... కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని, రాజకీయ ప్రత్యర్ధులపై దాడుల కోసం సీబీఐని దుర్వినియోగం చేస్తోందని అప్పట్లో అమిత్ షా ఆరోపించారు.

2014లో కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత... అమిత్ షా సమస్యల నుంచి బయటపడ్డారు. సీన్ కట్ చేస్తే... ఇప్పుడు అమిత్ షా కేంద్ర హోంమంత్రి... చిదంబరం ఎంపీ మాత్రమే. షా పవర్‌లోకి రాగానే.. చిదంబరానికి కష్టాలు మొదలయ్యాయి. 

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరం కేసు విచారిస్తున్న అధికారి బదిలీ

నాటి సెగ....నేడు పగ: దేవుడు రాసిన స్క్రిప్ట్ లో షా, చిదంబరం

చిదంబరం అరెస్ట్: రాత్రికి సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లోనే

రాజకీయ కుట్రే: చిదంబరం అరెస్ట్‌పై కార్తీ

కేంద్ర మాజీమంత్రి చిదంబరం అరెస్ట్ : సీబీఐ హెడ్ క్వార్టర్స్ కు తరలింపు

చిదంబరం ఇంటి వద్ద హైడ్రామా: గేట్లు ఎక్కి ఇంట్లోకి వెళ్లిన సీబీఐ అధికారులు

కాంగ్రెస్ కార్యాలయం వద్ద హైడ్రామా: సీబీఐని అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు

అజ్ఞాతం వీడిన చిదంబరం: తన కుటుంబంపై కుట్ర జరుగుతోందని ఆరోపణలు

చిదంబరానికి చుక్కెదురు: ముందస్తు బెయిల్‌పై శుక్రవారం విచారణ

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరం లింకులు ఇవీ.....

ఐఎన్ఎక్స్ కేసు:చిదంబరానికి చుక్కెదురు, అరెస్ట్ తప్పదా?

చిదంబరంపై లుక్‌అవుట్ నోటీసులు... ఏ క్షణమైనా అరెస్ట్

సీజేఐ వద్దకు బెయిల్ పిటిషన్, మధ్యాహ్నం తేలనున్న చిదంబరం భవితవ్యం

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: అజ్ఞాతంలోకి చిదంబరం, గాలిస్తున్న సీబీఐ

కూతురిని హత్య చేసిన ఆమె... చిదంబరాన్ని పట్టించింది..!