Asianet News TeluguAsianet News Telugu

మరో యువకుడితో భార్య, అశ్లీల వీడియోలు ఆన్ లైన్ లో పెట్టిన భర్త

ఆమె నగ్న వీడియోలను మాజీభర్త ఆన్‌లైన్‌లో పెట్టాడు. దీనిపై మహిళ ఫిర్యాదు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 

ex wife sex videos in online, police file case gainst ex husband
Author
Hyderabad, First Published Sep 20, 2018, 11:56 AM IST

తన భార్య.. తనని కాదని విడాకులు తీసుకొని.. ఆ తర్వాత మరో యువకుడిని పెళ్లి చేసుకుందనే అక్కసుతో.. ఓ వ్యక్తి ఆమె అశ్లీల వీడియోలను ఆన్ లైన్ లో పెట్టాడు. ఈ దారుణ సంఘటన మహారాష్ట్రలోని పూణే నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...పూణేకు చెందిన ఓ మహిళ గతంలో గోవాకు చెందిన ఓ యువకుడిని పెళ్లాడింది. మహిళ 2016 నుంచి 2018 వరకు మూడేళ్లు మొదటి భర్తతో కాపురం చేసింది. అనంతరం భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో వారిద్దరూ లీగల్ గా విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం మహిళ పూణేకు చెందిన మరో యువకుడిని పెళ్లాడింది. 

అంతే తన మాజీ భార్య రెండో పెళ్లి చేసుకుందనే కోపంతో ఆమె నగ్న వీడియోలను మాజీభర్త ఆన్‌లైన్‌లో పెట్టాడు. దీనిపై మహిళ ఫిర్యాదు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ భార్య అశ్లీల వీడియోలను ఆన్‌లైన్‌లో పెట్టిన మాజీ భర్తను త్వరలో అరెస్టు చేస్తామని పూణే పోలీసు అధికారి అరుణ్ వ్యాకర్ చెప్పారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios