బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాపై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత బీకే హరిప్రసాద్. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నించడం వల్లే అమిత్ షాకు స్వైన్ ఫ్లూ సోకిందన్నారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టే చర్యలు ఇప్పటికైనా ఆపకపోతే ఆయనకు జ్వరంతో పాటు డయేరియా ఇతర వ్యాధులు సోకే ప్రమాదం ఉందని హరిప్రసాద్ హెచ్చరించారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను బీజేపీ నేతలు ముంబైకి తరలించారని, వారికి బీజేపీ, ఆరెస్సెస్ కార్యకర్తలను కాపలాగా ఉంచారని ఆరోపించారు. స్వైన్ ఫ్లూతో బాధపడుతున్న అమిత్ షా ప్రస్తుతం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.