జియోకి షాకిచ్చిన ఎయిర్ టెల్

Airtel Rs 99 prepaid plan now offers 2GB data for 28 days, unlimited calls to compete with Jio Rs 98 plan
Highlights

రూ.99కే 56జీబీ మొబైల్ డేటా

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ మరోసారి జియోకి షాకిచ్చింది. ఇప్పటికే అందిస్తున్న ప్లాన్ లో కొద్ది పాటి మార్పులు చేసి వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింది. తన ప్రీపెయిడ్ వినియోగదారులకు అందిస్తున్న రూ.99 ప్లాన్ బెనిఫిట్స్‌ను మార్చింది. 

ఇంతకు ముందు వరకు ఈ ప్లాన్‌కు గాను 1జీబీ డేటా వచ్చేది. కానీ ఇకపై 2జీబీ డేటా లభిస్తుంది. ఇక అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా వస్తాయి. అదే జియోలో అయితో రూ.98 ప్లాన్‌కు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 300 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి.

అందుకే జియోకు పోటీగా ఒక రూపాయి తగ్గింపుతో ఎయిర్‌టెల్ ఈ ప్లాన్‌లో మార్పు చేసింది. ఇక ఈ రెండు సంస్థలు అందిస్తున్న ఈ ప్లాన్ల వాలిడిటీ 28 రోజులుగా ఉంది. మరో వైపు బీఎస్‌ఎన్‌ఎల్ లో  డేటా సునామీ ఆఫర్ కింద రూ.98 కి రోజుకు 1.5 జీబీ డేటా వస్తుంది. 

ఈ ప్లాన్ వాలిడిటీ 26 రోజులు ఉండగా ఇందులో ఎలాంటి కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు రావు. కేవలం మొబైల్ డేటా మాత్రమే వస్తుంది. అయినప్పటికీ రూ.98 ప్లాన్లలో అన్నింటికన్నా బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తున్న డేటాయే ఎక్కువ కావడం విశేషం. ఇందులో 26 రోజులకు గాను రోజుకు 1.5 జీబీ డేటా చొప్పున మొత్తం 39 జీబీ డేటా లభిస్తుంది. 

loader