Asianet News TeluguAsianet News Telugu

ఛలో వారణాసి: మోడీపై నామినేషన్లకు తెలంగాణ రైతులు

ప్రధాన మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి ఎంపీ స్థానంలో నిజామాబాద్ పసుపు రైతులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈ నెల 27వ తేదీన నిజామాబాద్ పసుపు రైతులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

Nizambad turmeric farmers ready to file nominations in varanasi mp segment
Author
Nizamabad, First Published Apr 25, 2019, 3:23 PM IST

నిజామాబాద్: ప్రధాన మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి ఎంపీ స్థానంలో నిజామాబాద్ పసుపు రైతులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈ నెల 27వ తేదీన నిజామాబాద్ పసుపు రైతులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నిజామాబాద్ రైతులకు తమిళనాడు రైతులు కూడ మద్దతు ప్రకటించారు.

నిజామాబాద్‌లో పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని, ఎర్రజొన్న రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పలు రకాలుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగానే ఈ నెల 11 వ తేదీన జరిగిన నిజామాబాద్ ఎంపీ స్థానంలో కూడ 178 మంది పసుపు రైతులు పోటీ చేశారు. 

ఇక వారణాసిలో పోటీ చేసి తమ సమస్యను దేశంలోని ప్రజల దృష్టికి తీసుకెళ్లాని నిజామాబాద్ రైతులు భావిస్తున్నారు.  వారణాసిలో నామినేషన్లు దాఖలు చేయడానికి పసుపు రైతులు గురువారం నాడు బయలుదేరి వెళ్లారు.

వారణాసి ఎంపీ  స్థానం నుండి నిజామాబాద్‌కు చెందిన 50 మంది పసుపు రైతులు పోటీ చేయనున్నారు. ఈ నెల 26వ తేదీన రైతులు వారణాసికి చేరుకొంటారు. ఈ నెల 25 వ తేదీన ప్రధానమంత్రి  మోడీ తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. మోడీ నామినేషన్ దాఖలు చేసే రోజునే వారణాసికి చేరుకొంటారు. ఈ నెల 27వ తేదీన వారు నామినేషన్లు దాఖలు చేస్తారు.

నిజామాబాద్ రైతులకు తమిళనాడు రైతులు కూడ తమ మద్దతును ప్రకటించారు. తాము ఏ పార్టీకి మద్దతుగా నామినేషన్లు దాఖలు చేయడం లేదని రైతులు చెబుతున్నారు. తమ సమస్యలను చెప్పేందుకు నామినేషన్లు దాఖలు చేస్తున్నట్టుగా రైతులు ప్రకటించారు. అవసరమైతే మోడీని కూడ కలుస్తామని  రైతులు చెప్పారు.

సంబంధిత వార్తలు

మోడీపై పోటీకి నిజామాబాద్ పసుపు రైతులు

రైతులకు షాక్: నిజామాబాద్ ఎన్నికపై తేల్చేసిన హైకోర్టు

నిజామాబాద్ సీట్లో ఈవీఎంలే వాడుతాం: ఈసీ

ఇందూరు ఫైట్: బ్యాలెట్‌ పేపర్‌కే రైతుల పట్టు

నిజామాబాద్ పోరు: రైతు అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు

దిగిరాని రైతులు: కవిత సహా ప్రధాన పార్టీల అభ్యర్థులకు తిప్పలే

నామినేషన్ల ఉపసంహరణకు ఒత్తిడి: మండిపడుతున్న రైతు సంఘాలు

కవితకు చిక్కులు: నల్గొండ బాటలో ఇందూరు రైతులు

కవిత సీటుకు రైతుల భారీ నామినేషన్లు

ఖమ్మం పార్లమెంట్‌ నుండి పోటీకి సుబాబుల్ రైతుల ప్లాన్

ఇందూరులో కల్వకుంట్ల కవితకు నామినేషన్ల పోటు

కవితకు చిక్కులు: పసుపు రైతులకు దారి చూపిన నల్గొండ

నిజామాబాదులో కదం తొక్కిన ఎర్రజొన్న, పసుపు రైతులు (ఫొటోలు)

 

Follow Us:
Download App:
  • android
  • ios