Asianet News TeluguAsianet News Telugu

రైతులకు షాక్: నిజామాబాద్ ఎన్నికపై తేల్చేసిన హైకోర్టు

నిజామాబాద్ ఎంపీ స్థానానికి ఎన్నికలను నిలిపివేయలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. 

telangana high court orders to conduct nizambad mp elections on april 11
Author
Nizamabad, First Published Apr 8, 2019, 4:53 PM IST

హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీ స్థానానికి ఎన్నికలను నిలిపివేయలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ స్థానం నుండి తమకు ఎన్నికల గుర్తులు కేటాయించని కారణంగా ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ రైతు అభ్యర్థులు  హైకోర్టును ఆశ్రయించారు.

రైతు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం నాడు హైకోర్టు విచారణ  జరిపింది. తమకు ఎన్నికల గుర్తులను కేటాయించలేదని ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ రైతు అభ్యర్థులు హైకోర్టును కోరారు.

అయితే ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని కోర్టు తేల్చి చెప్పింది. తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. నిజామాబాద్ ఎంపీ స్థానం నుండి  185 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు.వీరిలో 177 మంది రైతులే పోటీలో ఉన్నారు. పసుపు, ఎర్రజొన్న రైతులు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్న విషఫయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

నిజామాబాద్ సీట్లో ఈవీఎంలే వాడుతాం: ఈసీ

ఇందూరు ఫైట్: బ్యాలెట్‌ పేపర్‌కే రైతుల పట్టు

నిజామాబాద్ పోరు: రైతు అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు

దిగిరాని రైతులు: కవిత సహా ప్రధాన పార్టీల అభ్యర్థులకు తిప్పలే

నామినేషన్ల ఉపసంహరణకు ఒత్తిడి: మండిపడుతున్న రైతు సంఘాలు

కవితకు చిక్కులు: నల్గొండ బాటలో ఇందూరు రైతులు

కవిత సీటుకు రైతుల భారీ నామినేషన్లు

ఖమ్మం పార్లమెంట్‌ నుండి పోటీకి సుబాబుల్ రైతుల ప్లాన్

ఇందూరులో కల్వకుంట్ల కవితకు నామినేషన్ల పోటు

కవితకు చిక్కులు: పసుపు రైతులకు దారి చూపిన నల్గొండ

నిజామాబాదులో కదం తొక్కిన ఎర్రజొన్న, పసుపు రైతులు (ఫొటోలు)

Follow Us:
Download App:
  • android
  • ios