హైదరాబాద్:  నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ఈవీఎంల ద్వారానే ఎన్నికలను నిర్వహిస్తామని ఈసీ ప్రకటించింది.

 కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు హైద్రాబాద్‌లో సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రత్యేకించి నిజామాబాద్ ఎంపీ స్థానంలో ఎన్నికల నిర్వహణపై చర్చించారు.

మంగళవారం నాడు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారి ఉమేష్ సిన్హా మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్ ఎంపీ స్థానంలో 185 మంది అభ్యర్ధులు బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఈవీఎంలలో ఇంత పెద్ద సంఖ్యలో అభ్యర్ధులకు ఎన్నికలు నిర్వహించడం చాలా గొప్ప విషయంగా ఆయన అభిప్రాయపడ్డారు.

నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు జిల్లాలో ఉన్నందున ఈ రెండు జిల్లాలకు చెందిన అధికారులతో సమావేశమైనట్టుగా ఆయన తెలిపారు.  ఈ ఎన్నికల విషయమై ఈసీఐఎల్, భెల్  కంపెనీ ఇంజనీర్లతో కూడ సమావేశమైనట్టుగా ఆయన వివరించారు. 

నిజామాబాద్ ఎంపీ స్థానంలో ఎన్నికల నిర్వహణకు గాను 25 వేల బ్యాలెట్, 2 వేల కంట్రోల్ యూనిట్లను వాడుతున్నామని ఆయన తెలిపారు. ఎన్నికలు ముగిసే వరకు ఇంజనీర్లంతా ఇక్కడే ఉంటారని చెప్పారు. నిజామాబాద్ ఎంపీ స్థానంలో ఎక్కువ మంది బరిలో ఉన్నందున పోలింగ్ సిబ్బందిని కూడ పెంచామన్నారు. ఇదిలా ఉంటే బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఎన్నికలను నిర్వహించాలని బరిలో ఉన్న రైతు అభ్యర్థులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

ఇందూరు ఫైట్: బ్యాలెట్‌ పేపర్‌కే రైతుల పట్టు

నిజామాబాద్ పోరు: రైతు అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు

దిగిరాని రైతులు: కవిత సహా ప్రధాన పార్టీల అభ్యర్థులకు తిప్పలే

నామినేషన్ల ఉపసంహరణకు ఒత్తిడి: మండిపడుతున్న రైతు సంఘాలు

కవితకు చిక్కులు: నల్గొండ బాటలో ఇందూరు రైతులు

కవిత సీటుకు రైతుల భారీ నామినేషన్లు

ఖమ్మం పార్లమెంట్‌ నుండి పోటీకి సుబాబుల్ రైతుల ప్లాన్

ఇందూరులో కల్వకుంట్ల కవితకు నామినేషన్ల పోటు

కవితకు చిక్కులు: పసుపు రైతులకు దారి చూపిన నల్గొండ

నిజామాబాదులో కదం తొక్కిన ఎర్రజొన్న, పసుపు రైతులు (ఫొటోలు)