నిజామాబాద్: నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్‌ పరిధిలో గురువారం నాడు నలుగురు రైతులు తమ నామినేషన్లను ఉపసంహరించుకొన్నారు.నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలను నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.

పసుపు, ఎర్రజొన్న రైతులు తమ డిమాండ్ల సాధన కోసం  236 నామినేషన్లు దాఖలు చేశారు. ఈ స్థానం నుండి టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ కవిత, కాంగ్రెస్ అభ్యర్ధిగా  మధు యాష్కీ, బీజేపీ అభ్యర్ధిగా అరవింద్ నామినేషన్లు దాఖలు చేశారు. 

 ఈ నెల 25వ తేదీన 179 నామినేషన్లు దాఖలయ్యాయి. మార్చి 20వ తేదీన 7, మార్చి 22వ తేదీన 56 నామినేషన్లు దాఖలయ్యాయి.  నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి మొత్తం 242 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో రైతులు 236 నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల స్కృూట్నీ తర్వాత 189 మంది ఈ స్థానం నుండి పోటీలో ఉన్నారు.

గురువారం నాడు నలుగురు రైతులు నామినేషన్లను ఉపసంహరించుకొన్నారు.ప్రధాన పార్టీల నుండి ఏడుగురు అభ్యర్ధులు  బరిలో ఉన్నారు.మిగిలిన 178 మంది రైతులే ఈ స్థానం నుండి  అభ్యర్ధులుగా పోటీలో నిలిచారు. 

185 మంది అభ్యర్ధులు బరిలో ఉన్న కారణంగా బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నియోజకవర్గానికి ఎన్నికల నిర్వహణ విషయమై సీఈఓ ఇవాళ సాయంత్రం స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు ప్రకటించాయి.

సంబంధిత వార్తలు

నామినేషన్ల ఉపసంహరణకు ఒత్తిడి: మండిపడుతున్న రైతు సంఘాలు

కవితకు చిక్కులు: నల్గొండ బాటలో ఇందూరు రైతులు

కవిత సీటుకు రైతుల భారీ నామినేషన్లు

ఖమ్మం పార్లమెంట్‌ నుండి పోటీకి సుబాబుల్ రైతుల ప్లాన్

ఇందూరులో కల్వకుంట్ల కవితకు నామినేషన్ల పోటు

కవితకు చిక్కులు: పసుపు రైతులకు దారి చూపిన నల్గొండ

నిజామాబాదులో కదం తొక్కిన ఎర్రజొన్న, పసుపు రైతులు (ఫొటోలు)