నిజామాబాద్: పాలకులకు తమ డిమాండ్లను తెలిపేందుకు పసుపు, ఎర్రజొన్న రైతులు సోమవారం నాడు కూడ నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్ధులతో పోటీగా రైతులు కూడ  నామినేషన్లు దాఖలు చేశారు. ఈ స్థానంలో సుమారు 200కు పైగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉందని సమాచారం.

నామినేషన్లు దాఖలు చేసేందుకు సోమవారం నాడు చివరి తేదీ కావడంతో పసుపు, ఎర్రజొన్న రైతులు నిజామాబాద్ కలెక్టరేట్‌లో క్యూలో నిల్చున్నారు. నామినేషన్లు దాఖలు చేసేందుకుగాను టోకెన్లు తీసుకొని రైతులు లైన్ లో నిల్చున్నారు. 

పసుపు, ఎర్రజొన్న రైతులు కొంత కాలంగా ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనల విషయమై పాలకులు సరిగా స్పందించడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ తరుణంలో  రైతాంగం  పార్లమెంట్ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసి తమ నిరసనను దేశం దృష్టికి తీసుకెశ్లాలని  నిర్ణయం తీసుకొన్నారు.

  నెల రోజుల క్రితమే   రైతు సంఘాలు సమావేశమై పోటీ చేయాలని నిర్ణయం తీసుకొన్నాయి. రైతులను కొందరు తమ రాజకీయ స్వార్థం కోసం రెచ్చగొడుతున్నారని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది.

శుక్రవారం నాటికి 40 మంది రైతులు నామినేషన్లు దాఖలు చేశారు. 96కు పైగా నామినేషన్లు దాఖలైతే ఆ సెగ్మెంట్‌లో ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహించనున్నారు. సోమవారం నాడు నామినేషన్లు దాఖలు చేసేందుకు నిజామాబాద్ రైతులు కలెక్టరేట్ కు చేరుకొన్నారు.సుమారు 200కు పైగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉందని సమాచారం.

సంబంధిత వార్తలు

ఖమ్మం పార్లమెంట్‌ నుండి పోటీకి సుబాబుల్ రైతుల ప్లాన్

ఇందూరులో కల్వకుంట్ల కవితకు నామినేషన్ల పోటు

కవితకు చిక్కులు: పసుపు రైతులకు దారి చూపిన నల్గొండ

నిజామాబాదులో కదం తొక్కిన ఎర్రజొన్న, పసుపు రైతులు (ఫొటోలు)