అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించింది. ఆంధ్రప్రదేశ్ లో 175 స్థానాలకు గానూ 150 స్థానాల్లో విజయం దిశగా అడుగులు వేస్తోంది. 

దీంతో ఓటమిని అంగీకరించిన ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. 

అమరావతి నుంచి నేరుగా హైదరాబాద్ కు చేరుకుని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కు తన రాజీనామా స్వయంగా అందజేయనున్నారని తెలుస్తోంది. శుక్రవారం నుంచి చంద్రబాబు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా, ఏపీ ప్రతిపక్ష నేతగా పనిచేయనున్నారు.