న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి తొలి రౌండ్లలో 328 సీట్లలో  ఆధిక్యంలో నిలిచింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమికి  104 సీట్లలో ఆధిక్యంలో ఉన్నారు. ఎగ్జిట్‌ పోల్స్ సూచించిన విధంగానే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే విధంగా ఉందని తొలి దశ ట్రెండ్స చెబుతున్నాయి.

దేశంలోని 542 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో   ఎన్డీఏ కూటమి మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని  ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే ఎన్డీఏ కూటమి భారీ విజయం దిశగా దూసుకెళ్లాయి. 

బీజేపీకి ఒంటరిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా  సీట్లను సాధించే అవకాశం ఉందని  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రెండు కూటములకు సంబంధం లేని పార్టీలు 110 స్థానాల్లో  ఆధిక్యంలో ఉన్నాయి.

మోడీ పాలనపై ప్రజలకు మరోసారి పట్టం కట్టేందుకు  సిద్దమయ్యారని  తొలి విడత పోలింగ్ కంటే ముందు నుండే బీజేపీ నేతలు చెబుతున్నారు.ఎన్నికల ఫలితాలు కూడ ఇదే రకంగా ఉంటాయని ట్రెండ్స్ కన్పిస్తున్నాయి. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాకుండా చేసేందుకు గాను నాన్ బీజేపీయేతర పార్టీలు కూటమిని ఏర్పాటు చేసేందుకు  ప్రయత్నించారు.  నాన్ బీజేపికి చెందిన పార్టీలను  చంద్రబాబునాయుడు కూడగట్టేందుకు ప్రయత్నించారు.

నాన్ బీజేపీ పార్టీల కూటమికి కాంగ్రెస్ పార్టీ కీలకంగా  ఉంది.బీజేపీని అధికారంలోకి రాకుండా చేసేందుకు గాను ఎన్నికల తర్వాత ఈ పార్టీలన్నీ కూటమిని ఏర్పాటు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, ఎగ్జిట్ పోల్స్ మాత్రం  ఈ పార్టీల్లో నిరాశను మిగిల్చాయి.దీంతో కొన్ని పార్టీల నేతలు బహిరంగంగానే  ఢిల్లీ సమావేశానికి దూరంగా ఉన్నారు.

యూపీలో బీజేపీని నిలువరించేందుకు ఎస్పీ, బీఎస్పీ కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. ఈ కూటమి అభ్యర్థులు యూపీ రాష్ట్రంలో తమ ప్రభావాన్ని  చూపినట్టుగా ట్రెండ్స్ ను బట్టి తెలుస్తోంది.