నిజామాబాద్:నిజామాబాద్ ఎంపీ స్థానానికి నామినేషన్లు దాఖలు చేసిన పసుపు, ఎర్రజొన్న రైతులు నామినేషన్లు ఉపసంహరింపజేసేలా కొన్ని పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని గమనించిన రైతు సంఘాలు తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేస్తున్నాయి.

పసుపు, ఎర్రజొన్న రైతులు తమ డిమాండ్ల సాధన కోసం  236 నామినేషన్లు దాఖలు చేశారు. ఈ స్థానం నుండి టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ కవిత, కాంగ్రెస్ అభ్యర్ధిగా  మధు యాష్కీ, బీజేపీ అభ్యర్ధిగా అరవింద్ నామినేషన్లు దాఖలు చేశారు. 

 ఈ నెల 25వ తేదీన 179 నామినేషన్లు దాఖలయ్యాయి. మార్చి 20వ తేదీన 7, మార్చి 22వ తేదీన 56 నామినేషన్లు దాఖలయ్యాయి.  నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి మొత్తం 242 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో రైతులు 236 నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల స్కృూట్నీ తర్వాత 45 నామినేషన్లను తిరస్కరించారు. అయితే దీంతో 191 మంది ఈ స్థానం నుండి పోటీలో ఉన్నారు.

ప్రధాన పార్టీల నుండి ఏడుగురు అభ్యర్ధులు  బరిలో ఉన్నారు. మిగిలిన 184 మంది రైతులే ఈ స్థానం నుండి  అభ్యర్ధులుగా పోటీలో నిలిచారు. ఇదిలా ఉంటే పోటీలో ఉన్న రైతులను ఉపసంహరించుకోవాలని అధికార పార్టీ నేతలు ఒత్తిడి తీసుకొస్తున్నారని రైతు సంఘాల నేతలు ఆరోపణలు  చేస్తున్నారు.

నామినేషన్లు ఉప సంహరించుకొంటే గ్రామాభివృద్ధి కమిటీకి లక్ష రూపాయాలను పరిహారంగా చెల్లించాలని ఆయా గ్రామాభివృద్ధి కమిటీలు తీర్మానం చేశాయి. మరో వైపు గ్రామ బహిష్కరణ కూడ చేస్తామని హెచ్చరించాయి. దీంతో నామినేషన్లను ఉప సంహరించుకొనేందుకు రైతులు ముందుకు రావడం లేదనే అభిప్రాయాలు కూడ  వ్యక్తమౌతున్నాయి.

సంబంధిత వార్తలు

కవితకు చిక్కులు: నల్గొండ బాటలో ఇందూరు రైతులు

కవిత సీటుకు రైతుల భారీ నామినేషన్లు

ఖమ్మం పార్లమెంట్‌ నుండి పోటీకి సుబాబుల్ రైతుల ప్లాన్

ఇందూరులో కల్వకుంట్ల కవితకు నామినేషన్ల పోటు

కవితకు చిక్కులు: పసుపు రైతులకు దారి చూపిన నల్గొండ

నిజామాబాదులో కదం తొక్కిన ఎర్రజొన్న, పసుపు రైతులు (ఫొటోలు)